జనసేన తో పోత్తే లేదు అప్పుడే వారిలో నిరుత్సాహం ?

తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో విజయం సాధించాలంటే తప్పనిసరిగా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందే అనే అభిప్రాయంలో ఆ పార్టీ అగ్రనాయకత్వం ఉండగా, తెలుగు తమ్ముళ్లు మాత్రం ఈ పొత్తు విషయంలో ఒక పక్క ఆనందంగానే ఉన్నా, మరో వైపు ఆందోళనలోనూ ఉన్నట్టు గా వ్యవహరిస్తున్నారు.2019 ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశ పరచడం, వైసీపీ మరింతగా బలోపేతం అవడంతో తప్పనిసరిగా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందే అనే అభిప్రాయానికి టిడిపి అధినేత చంద్రబాబు వచ్చేసారు.పొత్తు విషయమై పరోక్షంగా క్యాడర్ కు సంకేతాలు ఇస్తున్నారు.జనసేన ఏపీలో రాజకీయంగా మైలేజ్ పొందేలా చేసేందుకు తన తనయుడు నారా లోకేష్ ను సైలెంట్ అయ్యేలా బాబు చేశారు అనే గుసగుసలు వినిపించాయి.

 Tdp Leaders Fear On Janasena Aliance-TeluguStop.com

జనసేన టిడిపి పొత్తు ఖరారు అయితే, దాదాపు 40కి పైగా స్థానాలను జనసేనకు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది.ఒకవేళ అదే జరిగితే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేన ఎక్కువ సీట్లను తీసుకుంటుంది .ఇదే ఇప్పుడు ఈ ప్రాంత టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి లలోనూ, ఎమ్మెల్యేలలోనూ ఆందోళన కలిగిస్తోంది.ఏపీలో స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు యాక్టివ్ గా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ఈ ప్రాంత నాయకులు ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు.

Telugu Ap, Ap Government, Cbn, Janasena, Lokesh, Pavan Kalyan, Tdp, Tdp Janasena Aliance, Tdp Ledars Fear, Tdp Mla\\'s, Ysrcp-Telugu Political News

పార్టీ కార్యక్రమాల విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.దీనికి కారణం పొత్తులో భాగంగా తమ స్థానాలను జనసేనకు కనుక ఇస్తే, అప్పుడు తమ పరిస్థితి ఏమిటని ? అప్పటి వరకు భారీ స్థాయిలో ఖర్చు చేసినా, ఫలితం ఉండదనే అభిప్రాయం లో చాలామంది టిడిపి ఎమ్మెల్యేల్లో వచ్చేసింది.ఈ ప్రాంతంలోని కీలకమైన టిడిపి నాయకులు ఉన్నట్లు సమాచారం.ఇటీవల రైతు కోసం బాబు పిలుపు ఇచ్చిన కార్యక్రమంలో కూడా కొన్ని నియోజకవర్గాల నేతలు మాత్రమే పాల్గొనడంపై చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Tdp Leaders Fear On Janasena Aliance-జనసేన తో పోత్తే లేదు అప్పుడే వారిలో నిరుత్సాహం -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అసలు ఒక్క సారిగా ఈ ప్రాంత టిడిపి నేతల్లో మూడ్ చేంజ్ కావడానికి కారణం జనసేన తో పొత్తు ఉంటుందని విషయమేనని, ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే ఎక్కువ సీట్లు జనసేన కోరుకుంటుంది కాబట్టి, తమకు నిరాశ తప్పదు అనే అభిప్రాయంతో ఎప్పటి నుంచో నిరాశ, నిస్పృహల్లో ఈ ప్రాంత టిడిపి నేతలు ఉన్నారట.ప్రస్తుతం ఈ ప్రాంత నాయకుల ఆందోళనకు సంబంధించిన విషయం చంద్రబాబు దృష్టికి వెళ్లిందట.

#AP #Janasena #Ysrcp #Tdp Ledars Fear #TDPJanasena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు