బాబు నిర్ణయాలపై తమ్ముళ్ల చర్చేంటి ?

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై తెలుగు తమ్ముళ్ల మధ్య కొత్త చర్చ జరుగుతోంది.ఎంతసేపు వైసీపీ ప్రభుత్వం పైన,  జగన్ పైన విమర్శలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప,  పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి ఏవిధంగా బయటపడాలి ?  పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగించే విధంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో బాబు శ్రద్ధ చూపించడం లేదని, ఇలా అయితే 2024 ఎన్నికల్లో గెలిచేది ఎలా అంటూ బాబు నిర్ణయాలపై తెలుగు తమ్ముళ్లు నిట్టూర్చుతున్నారు.బాబు మీడియా ముందుకు వచ్చినా, జూమ్ మీటింగులో అయినా పదే పదే జగన్,  వైసీపీ ప్రస్తావన తీసుకు వస్తున్నారని,  ప్రతి చిన్న విషయాన్ని హైలెట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని,  కానీ ఈ సమయంలో వైసీపీ పై పెరుగుతున్న వ్యతిరేకత టీడీపీ బలోపేతానికి ఏవిధంగా ఉపయోగించుకోవాలో అనే విషయంపై దృష్టి సాధించలేకపోతున్నారు అనే విషయం పై తెలుగు తమ్ముళ్ళ మధ్య చర్చ జరుగుతోంది.

 Tdp, Chandrababu, Ys Jagan, Ap Cm Jagan, Cbn, Tdp Leaders, Telugudesam Party, Ys-TeluguStop.com

ఇటీవల కుప్పం నియోజకవర్గంలో జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందిన దగ్గర నుంచి బాబు తీరులో స్పష్టమైన మార్పు ఎక్కువగా కనిపిస్తోందని, ఆ ఓటమి ప్రభావం చంద్రబాబు భార్య భువనేశ్వరి పై వైసీపీ నేతలు చేసిన విమర్శలు సందర్భంగా కన్నీళ్లు తెప్పించాయి అనేది మెజార్టీ తెలుగు తమ్ముళ్ల అభిప్రాయం.

ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఏ చోట్ల గెలిచింది.దీనిపై  బాబు సమీక్ష నిర్వహిస్తున్నారు.అసలు రెండు చోట్ల గెలుపు పై బాబు స్థాయి వ్యక్తి సమీక్ష నిర్వహించడం ఏంటనేది తెలుగు తమ్ముళ్ల అభిప్రాయం.

Telugu Ap Cm Jagan, Chandrababu, Jagan, Tdp, Telugudesam, Ys Jagan, Ysrcp-Telugu

ఇటువంటి సమీక్షలు నిర్వహించినా ఫలితం ఉండదని,  ఇదే సమయంలో పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టాలని, పదేపదే ప్రభుత్వం జగన్ పైన విమర్శలు చేస్తూ,  కాలయాపన చేసే కంటే గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టి 2024 ఎన్నికల్లో గెలుపొందేందుకు అవసరమైన అన్ని అస్త్రాలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం సొంత పార్టీ నాయకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.సమీక్షలు జూమ్ మీటింగులు అంటూ కాలయాపన చేయడం కంటే,  పార్టీలో వాస్తవ పరిస్థితి ఏమిటనే విషయంపై బాబు దృష్టిసారించాలని సూచనలు సొంత పార్టీ నాయకుల నుంచే వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube