లోకేష్ పై టీడీపీ లో చర్చ ఇదే ? ఈ స్పీడ్ చాలా ఇంకా కావాలా ?   

Lokesh Chandrababu Naidu ysrcp TDP , ap, ap governament, bjp, chandrababu, elections, gods, jagan, janasena, nara lokesh, party, social media, tdp, ysrcp - Telugu Ap, Ap Government, Bjp, Chandrababu, Elections, Gods, Jagan, Janasena, Nara Lokesh, Party, Social Media, Tdp, Ysrcp

టిడిపి యువ నాయకుడు నారా లోకేష్ వ్యవహారంపై చాలాకాలంగా టిడిపిలో చర్చ జరుగుతున్నా, చంద్రబాబు తర్వాత రాజకీయ వారసుడిగా లోకేష్ ఉన్నా , ఆయన ప్రభావం అంతంతమాత్రమే అని , టిడిపి బరువు బాధ్యతలను ఆయన మోయలేరు అనే వాదన తెరపైకి వచ్చినా, లోకేష్ ప్రభావం పెద్దగా కనిపించలేదు.కేవలం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు మాత్రమే ఏదైనా విషయంపై స్పందిస్తూ,  పూర్తిగా సైలెంట్ గా ఉండే వారు.

TeluguStop.com - Tdp Leaders Discution About Nara Lokesh Issue

ఏ విషయం పైన అయినా, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మాత్రమే స్పందించే వారు.ఎక్కడ పర్యటనలు ఉన్నా, పరామర్శలు ఉన్నా లోకేష్ పెద్దగా స్పందించేవారు కాదు.

పూర్తిగా చంద్రబాబు ఆ వ్యవహారాలను చూసుకునే వారు.కొద్ది రోజులుగా లోకేష్ లో పూర్తిగా మార్పు కనిపిస్తోంది.

TeluguStop.com - లోకేష్ పై టీడీపీ లో చర్చ ఇదే ఈ స్పీడ్ చాలా ఇంకా కావాలా  -Political-Telugu Tollywood Photo Image

అధికార పార్టీ వైసీపీ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, ప్రభుత్వ పథకాల పైన జగన్ నిర్ణయాలపైన తీవ్రస్థాయిలో ఆందోళన నిర్వహిస్తున్నారు.అలాగే జిల్లాల వారిగా పర్యటనలు చేస్తూ, తన పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా ఏపీలో విగ్రహాల ధ్వంసం, అనేక ప్రాంతాల్లో దాడులు చోటు చేసుకుంటున్న వ్యవహారాలపై ఏపీ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది  ఈ వ్యవహారంపై లోకేష్ స్పందిస్తున్నారు.ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

ఈ వ్యవహారంలో బిజెపి ని సైతం వదిలిపెట్టకుండా విమర్శిస్తూ, అధికార పార్టీని ఇరుకున పెట్టడంలో సక్సెస్ అయ్యారు.ఈ విషయంలో ఒక రకంగా చంద్రబాబు కంటే లోకేష్ విమర్శలు ఘాటుగా ఉండడం వంటి వ్యవహారాలతో లోకేష్ శక్తి సామర్థ్యాలపై పార్టీ నాయకుల్లోనూ నమ్మకం ఏర్పడింది.

Telugu Ap, Ap Government, Bjp, Chandrababu, Elections, Gods, Jagan, Janasena, Nara Lokesh, Party, Social Media, Tdp, Ysrcp-Telugu Political News

ఇదే స్పీడ్ ను కొనసాగిస్తూ లోకేష్ పార్టీ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పట్టు సాధించగలిగితే టిడిపి కి తిరుగు ఉండదని , లోకేష్ శక్తిసామర్థ్యాలపై పార్టీ శ్రేణుల్లో నమ్మకం ఏర్పడుతుందనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో నెలకొంది.ఇప్పటివరకు చంద్రబాబు తర్వాత ఎవరు ఆ స్థాయిలో ప్రభావం ఎవరు చూపించగలరు అనే అభిప్రాయం లో ఉన్న టిడిపి నాయకులకు లోకేష్ స్పీడ్ మరింత ఉత్సాహం మరింత పెరిగిపోయింది.

#Chandrababu #Gods #Social Media #Nara Lokesh #AP Government

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు