ఆయన ఏపీ మంత్రి కాదు బూతుల మంత్రి  

Tdp Leader Varla Ramayya Sesational Coments On Kodali Nani-

తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ నేతలు వైసీపీ నేతల మీద తెలుగుదేశం నాయకులు ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.ముఖ్యంగా కృష్ణా జిల్లా నేతలు ఈ విషయంలో ఎక్కువగా తమ నోటికి పని చెబుతున్నారు.చంద్రబాబు లోకేష్ ను ఉద్దేశించి ఏపీ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే టిడిపి నేత వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు విరుచుకుపడ్డారు.కొడాలి నాని వల్లభనేని వంశీ ఇద్దరు చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని బూతులతో తెలుగుదేశం పార్టీపై దాడి చేస్తారా అంటూ మండిపడ్డారు.

Tdp Leader Varla Ramayya Sesational Coments On Kodali Nani- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Tdp Leader Varla Ramayya Sesational Coments On Kodali Nani--Tdp Leader Varla Ramayya Sesational Coments On Kodali Nani-

బూతులు మాట్లాడే వ్యక్తిని మంత్రి ని ఎలా చేశారని, ఈ విషయంలో జగన్ దోషిగా నిలబడాలని వర్ల విమర్శలు చేశారు.కొడాలి నాని ఏపీ రాజకీయ చరిత్రలో బూతుల మంత్రిగా నిలిచిపోతారని అన్నారు.అలాగే వల్లభనేని వంశీ చంద్రబాబు ఆయన తండ్రి ఖర్జూర నాయుడు మీద చేసిన వ్యాఖ్యలను వర్ల రామయ్య ఖండించారు.వారిద్దరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏదో ఒకసారి లోకేష్ బాబు తెలుగు చదవలేక రెండు తప్పులు చదివితే ఇష్టం వచ్చినట్లుగా అల్లరి చేస్తున్నారు, కానీ జగన్ నిరక్షరాస్యత అనే మాట స్పష్టంగా పలకలేరని ఎద్దేవా చేశారు.