ఎన్‎హెచ్ఆర్సీకి టీడీపీ నేత లేఖ..!

రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నేషషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్‎హెచ్ఆర్సీ) కు లేఖ రాశారు.రాష్ట్రంలో అనాగరిక పాలన నడుస్తోందని వివరించారు.

 Andra Pradesh, Tdp Leader, Varla Ramaiah, Nhrc, Chandra Babu,-TeluguStop.com

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, బీసీలు, మహిళలు, అట్టడుగు వర్గాల వారిపై దాడులు పెరిగిపోయాయని లేఖలో పేర్కొన్నారు.దీనికి దళిత యువకుడైన వరప్రసాద్ పై జరిగిన దాడి ప్రత్యక్ష సాక్ష్యమని అన్నారు.

మరోవైపు రాష్ట్రంలో ఇసుక మాఫియా యథేశ్చగా కొనసాగుతోందని వర్ల రామయ్య వెల్లడించారు.

స్థానిక వైసీపీ నేత, జక్కంపూడి రాజా అనుచరుడు కావల కృష్ణమూర్తి 40 మందితో కలిసి వరప్రసాద్ పై దాడికి తెగబడి కులం పేరుతో దూషించారని  వర్ల రామయ్య లేఖలో తెలిపారు.

వరప్రసాద్ ను కులం పేరుతో దూషించి గుండు గీయటమే కాకుండా, స్టేషన్ కు వచ్చిన అతని తల్లిని కూడా దూషించారని అన్నారు.మరో వైపు ప్రజలను రక్షించాల్సిన సీతానగరం పోలీసులు వరప్రసాద్ కు సహయంగా వచ్చిన స్నేహితులైన అనిల్, అఖిల్, సందీప్ లను లాఠీలతో చితకబాదారని పేర్కొన్నారు.

దీనికి కారణమైన పోలీసులపై, వైసీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయాలని ఎన్‎హెచ్ఆర్సీను వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

కొందరు అధికారులను వేకెన్సి రిజర్వులో పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వర్ల రామయ్య తెలిపారు.

దీంతో సదరు ప్రభుత్వ అధికారులు 50శాతం జీతాలు కోల్పోతున్నారని లేఖలో వివరించారు.రాష్ట్రంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై జాతీయ కమిషన్ స్పందించాలని వర్ల రామయ్య కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube