హరీష్ రావు సీఎం అవ్వొచ్చంటూ ... రేవూరి సంచలన వ్యాఖ్యలు  

తెలంగాణాలో విపక్షాలన్నీ ఇప్పడు టీఆర్ఎస్ కీలక నాయకుడు హరీష్ రావు మీదే దృష్టిపెట్టాయి. ఆయన జాలితోకూడిన విమర్శలు చేస్తూ … ఇరకాటంలో పడేస్తున్నారు. తాజాగా… టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ… హరీష్ రావు విషయాలను ప్రస్తావించాడు.

Tdp Leader Revuri Prakshreddy Coments On Hareeshrao-

Tdp Leader Revuri Prakshreddy Coments On Hareeshrao

‘‘తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన.. రాష్ట్రం రావడానికి, అనంతరం టీఆర్‌ఎస్‌ అధికారం చేజిక్కించుకోవడానికి విశేషంగా కృషి చేసిన హరీశ్‌ రావు కేసీఆర్‌కు పరాయివాడయ్యాడు. పార్టీలోని సీనియర్లు ఎవరైనా కేటీఆర్‌నే కలవాలని ఆదేశిస్తున్న కేసీఆర్‌.. హరీశ్‌ను అడుగడుగునా అవమానిస్తున్నారు. దాదాపుగా పక్కనబెట్టారు. దాంతో, టీఆర్‌ఎస్‌లో అంతఃకలహాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు మెజారిటీ సీట్లు రాకపోతే హరీశ్‌ తన వర్గంతో బయటకు రావచ్చు. పరిస్థితులు అనుకూలిస్తే ఆయన సీఎం అయినా ఆశ్చర్యపోనక్కరలేదు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు రేవూరి.