హనుమకొండలో టిడిపి నాయకుడి దారుణ హత్య.. ?

మనిషిని మలీనం చేస్తుంది ఏంటంటే పగ, ప్రతీకారం.ఇవి ఒక్క సారి మనస్సులోకి ప్రవేశించాయంటే తమ పంతం నెరవేర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది.

 Tdp Leader Puli Swami Brutally Murdered In Hanumakonda, Hanumakonda, Hyderabad,-TeluguStop.com

మనిషిలోని జ్ఞానాన్ని చంపేసి, విచక్షణ కోల్పోయేలా చేసి, తాను ఏం చేస్తున్నాడో తెలియని స్దితిలోకి తీసుకెళ్లుతుంది.ఫలితంగా ఒక మనిషిని దారుణంగా చంపడమో, తాను చావడమో చేస్తాడు ఈ స్దితిలో ఉన్న మనిషి.

ఇకపోతే ఇలాంటి హత్యే ఒకటి హనుమకొండలో జరిగింది.ఆ వివరాలు చూస్తే.హనుమకొండలోని హైదరాబాద్ జాతీయ రహదారి పై, జనగామ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్ ఎదురుగా, టిడిపి నాయకుడు, మాజీ కౌన్సిలర్ పులి స్వామీ (54) దారుణ హత్యకు గురయ్యారు.మార్నింగ్ వాకింగ్ చేస్తున్న ఆయనను మాటు వేసిన అగంతకులు హత్య చేసి పరారయ్యారు.‌‌

Telugu Acp Vinod Kumar, Hanumakonda, Hyderabad, Janagaon, Murdered, Puli Swamy,

ఇక హంతకులు వాడిన బైక్ కూడా అక్కడే వదిలేసారు.కాగా హత్యా సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.అయితే గత కొంత కాలంగా పులి స్వామికి భూ వివాదలు ఉన్నట్లు తెలుస్తొందని, హత్యచేసిన హంతకులను తగిన ఆధారాలతో త్వరలోనే పట్టుకుంటాం అని ఏసిపీ వినోద్ కుమార్ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube