పవన్ పై టీడీపీ...'ఫ్లెక్సీ రాజకీయం'     2018-11-06   14:23:33  IST  Surya Krishna

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో చేస్తున్న ప్రజాపోరాట యాత్రలో ఎంతోమంది బాధిత ప్రజల గోడు వింటూ వారి సమస్యలను తెలుసుకుంటూ చేపడుతున్న టూర్ ఎంతో విజయవంతంగా దూసుకుపోతోంది.. ఈ క్రమంలోనే తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్రబాబు పై ఆయన తనయుడు లోకేష్ పై పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ప్రశ్నలను తెలుగుదేశం పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు…బహిరంగ వేదికలపై పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీపై ప్రశ్నించే తీరు జనసేన పార్టీకి మరింత ఊపు తీసుకొస్తోంది. చంద్రబాబు లోకేష్ అవినీతి చేశారంటూ వారికి ఏపీని పాలించే అర్హత లేదంటూ పవన్ చేస్తున్న విమర్శలు మరో పక్క తెలుగుదేశం పార్టీలో కాక రేపుతున్నాయి.

TDP Leader Katragadda Babu Banner Against On Pawan Kalyan-

TDP Leader Katragadda Babu Banner Against On Pawan Kalyan

అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శల దాడిని తెలుగుదేశం నేతలు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నా సరే వారి ఆరోపణల్లో కానీ వ్యాఖ్యల్లో గాని అంతగా పస లేకపోవడంతో టీడీపీ నేతలు పవన్ ని విమర్శించే విషయంలో సరికొత్త పంథాని ఎంచుకున్నారు.. అదేంటంటే ఫ్లెక్సీ ల రూపంలో పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు ఈ తాలూకు ఎదురుదాడి బాగానే వర్కవుట్ అవుతుందని ప్రజల నుంచి స్పందన బాగుందని టిడిపి నేతలు అంటున్నారు..

తాజాగా తెలుగుదేశం పార్టీ నేత కాట్రగడ్డ బాబు పవన్ పై విమర్శలు చేసేకంటే ఫ్లెక్సీలు తోనే బదులు చెప్పాలని, పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇప్పుడిది ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది.. పవన వి అహంకారపూరిత మాటలుగా ఫ్లెక్సీలో రాశారు. 2009లో అన్నదమ్ములు కలిసి పోటీ చేస్తేనే 20 సీట్లు కూడా రాలేదు ఇప్పుడు పవన్ కి రెండు సీట్లు వస్తే ఎక్కువ అని ఎద్దేవా చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. ఈ ఫ్లెక్సీలలో ఒకవైపు కాటమరాయుడు సినిమా లో కోడిపుంజు తో ఉన్న ఫోటో ఉండగా.. అదే ఫ్లెక్సీలో మరోవైపు చంద్రబాబు కాట్రగడ్డ ఫోటోలు ఏర్పాటు చేశారు.

TDP Leader Katragadda Babu Banner Against On Pawan Kalyan-

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.. ముందు ముందు ఇలాంటి ఫ్లెక్సీలతో పవన్ కళ్యాణ్ కి బుద్ధి చెప్తామని టీడీపీ నేతలు అంటున్నారు.. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా టిడిపి పై చేస్తున్న విమర్శలకు క్షమాపణలు చెప్పాలని లేకుంటే ఈ ఫ్లెక్సీల దాడి మరింత ఉద్ధృతం అవుతుందని హెచ్చరిస్తున్నారు.. మరి జనసేనాని ఈ ఫ్లెక్సీల రాజకీయంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే