గుంటూరు: టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్.అధికారం ఉంటే రాష్ట్రాన్ని ఎలా దోచేయవచ్చొ జగన్ నిరూపించారు.
పదహారు నెలల పాటు జైల్లో ఉండి ఎలా దోచుకోవచ్చు రీసెర్చి చేశారు.ఏపిని సర్వనాశనం చేశారు.
ఏపికి జగన్ కు ఎందుకు అవసరం లేదో వంద కారణాలు చెబుతాం.వంద కారణాలతో పుస్తకం వేస్తాం.
పోలవరం కట్టలేదు, రాజధాని లేకుండా చేశారు.ఒకసారి అవకాశం ఇస్తే ఏపిని తెలంగాణకు తాకట్టు పెట్టారు.
మరోసారి అవకాశం ఇస్తే బ్రిటీష్ వాడికి అమ్మేస్తాడు.
అధికారంలోకి వచ్చిన తర్వాత నాసిరకం సారా అమ్ముకుంటూ తాగుబోతులను పెంచాడు.
దళితులకు జగన్ చేసినంత ద్రోహం ఇంకే ముఖ్యమంత్రి చేయలేదు.విశాఖలో భూములు కొట్టేయడానికే కొత్త అసైన్మెంట్ చట్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను భయపెట్టి బానిసలుగా చేస్తున్నారు.మీడియా సమావేశం పెడితే పోలీసులను కాపలా పెట్టారు.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి.ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా బ్రతకాలన్నా రాష్ట్రపతి పాలన కావాలి.
ఒక్క తడి నీళ్ళు ఇవ్వటం చేతకాని మంత్రి పోసుకోలు మాటలు చెబుతాడు.