రాజమహేంద్రవరంలోని డెల్టా ఆసుపత్రికి ధూళిపాళ్ల.. !

ఒకప్పుడు చట్టం తనపని తాను చేసుకు పోతుందంటే న్యాయాన్ని రక్షించి అన్యాయాన్ని శిక్షిస్తుందని భావించే వారు.కానీ నేటి కాలంలో ఈ పదానికే అర్ధం మారిపోయింది.

 Tdp Leader Dhulipalla Narendra In Delta Hospital-TeluguStop.com

రాజకీయాల్లో అవినీతిపనులు ఎక్కువగా చోటు చేసుకోవడంతో వాటి నుండి బయటపడేందుకు నేతలు చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకున్నారనే ఆరోపణలు సమాజంలో తీవ్రంగా ప్రచారం జరుగుతున్నాయట.

ఇక రాజకీయ కక్షలో భాగంగా చట్టాన్ని ఉపయోగించుకుంటున్న నేతలు కూడా ఉన్నారు.

 Tdp Leader Dhulipalla Narendra In Delta Hospital-రాజమహేంద్రవరంలోని డెల్టా ఆసుపత్రికి ధూళిపాళ్ల.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న అరెస్ట్‌ల పర్వం పై ఇలాంటి గుసగుసలే వినిపిస్తున్నాయి.ఇకపోతే సంగం డెయిరీలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే కరోనా బారినపడిన నరేంద్రకు నెగటివ్ రావడంతో బుధవారం రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారానికి తరలించారు.ఈ విషయంలో ఏసీబీ కోర్టు తమకు తెలియకుండా నరేంద్రను జైలుకు ఎలా తరలిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసిన నేపధ్యంలో తిరిగి జైలు అధికారులు నిన్న రాజమహేంద్రవరంలోని డెల్టా ఆసుపత్రికి తరలించారు.

కాగా ఇక్కడ ఐసోలేషన్ లో ధూళిపాళ్ల ఐదు రోజులపాటు చికిత్స తీసుకోనున్నట్లుగా సమాచారం.

#Delta Hospital #TDp Leader

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు