కొడాలి నాని కి వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు కావటం పట్ల కొడాలి నాని ( Kodali Nani )నేడు కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.నిన్న ములాఖాత్ లో నారా భువనేశ్వరి, బ్రహ్మణి, అచ్చెనాయుడు చంద్రబాబుతో భేటీ కావడం జరిగింది.

 Tdp Leader Ayyannapatrudu Who Gave Warning To Kodali Nani Tdp, Ayyannapatrudu, K-TeluguStop.com

ఈ భేటీ అనంతరం చంద్రబాబు తినటానికి టేబుల్ కూడా లేదని దోమలు కూడుతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.దీంతో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.

జైలులో దోమలు కాకుండా రంభ, ఊర్వశి వచ్చి కన్ను కొడతాయా అంటూ సెటైర్లు వేశారు.

జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఎవరికైనా ఒకేలా ట్రీట్ మెంట్ ఉంటుందని వ్యాఖ్యానించారు.

దీంతో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు( Ayyannapatrudu ) వార్నింగ్ ఇచ్చారు.కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకో.లేదంటే ఆడవారి చేతుల్లో చెప్పు దెబ్బలు తింటావు.ఎన్టీఆర్( NTR ) కుటుంబ సభ్యుల మోచేతి నీళ్లు తాగే ఈ స్థితికి వచ్చావని మర్చిపోయావా.? ఇన్నేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న.మేం బరితెగించి వ్యక్తిగత విమర్శలు చేయలేదు.

నాని లాంటి వ్యక్తిని తరిమేసి వచ్చే ఎన్నికలలో మంచి వ్యక్తిని.గుడివాడ ప్రజలు ఎన్నుకోవాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube