కొడాలి నానికి అయ్యన్న పాత్రుడు పంచ్.. ఈ వయసులో రేప్ కేసులా?

గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టారంటే చాలు టీడీపీ నేతలను, చంద్రబాబును ఓ రేంజ్‌లో ఏకిపారేస్తుంటారు.ఆయన నోటి నుంచి ఎప్పుడు ఎలాంటి పదం వస్తుందో కూడా ఊహించడం కష్టమే.

 Tdp Leader Ayyannapatrudu Fires On Kodali Nani In Mini Mahanadu , Telugu Desam Party, Ayyannapatrudu, Ysrcp, Kodali Nani, Tdp Leader Ayyannapatrudu-TeluguStop.com

అందుకే వైసీపీలో ఆయన్ను ఫైర్‌బ్రాండ్‌గా అభివర్ణిస్తుంటారు.తాజాగా కొడాలి నాని ఇలాకాలో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా హాజరయ్యారు.

 Tdp Leader Ayyannapatrudu Fires On Kodali Nani In Mini Mahanadu , Telugu Desam Party, Ayyannapatrudu, Ysrcp, Kodali Nani, Tdp Leader Ayyannapatrudu-కొడాలి నానికి అయ్యన్న పాత్రుడు పంచ్.. ఈ వయసులో రేప్ కేసులా-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి పంచ్‌ల పంచ్‌లు వేశారు.

కొడాలి నాని పెద్ద దొంగ అని.నాడు ఎన్టీఆర్ మోచేతి నీళ్లు తాగి.నేడు చంద్రబాబును విమర్శిస్తున్నాడని ఫైర్ అయ్యారు.మూడేళ్ల పాటు కొడాలి నాని పని చేసిన మంత్రి శాఖ గురించి కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు.ఆనాడు చంద్రబాబు సీటు ఇవ్వకపోతే ఈనాడు ఆయన గతి ఏమయ్యేదని నిలదీశారు.సన్నబియ్యం విషయంలో మాట మార్చిన వ్యక్తి అంటూ ఎద్దేవా చేశారు.

తనపై వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్నో కేసులు పెట్టిందని.అయినా తాను భయపడేది లేదని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.ఈ వయసులో తన మీద రేప్ కేసులు పెట్టిన వైసీపీని ఏమనాలో కూడా అర్థం కావడం లేదని మండిపడ్డారు.టీడీపీ ఒక ప్రభంజనమని.

ఎపుడు ఎన్నికలు జరిగినా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.టీడీపీ కోసం అవసరమైతే చావడానికైనా తాను రెడీ అని ప్రకటించారు.

అయ్యన్నపాత్రుడు మాటలు విన్నాక టీడీపీ అభిమానులు అయ్యన్నా.మజాకా అని ప్రశంసలు కురిపిస్తున్నారు.కొడాలి నానికి మొగుడు అయ్యన్నపాత్రుడేనని అభిప్రాయపడుతున్నారు.తాను పార్టీ కోసం ఏమైనా చేస్తాను అన్న అయ్యన్నపాత్రుడు డైలాగులు మాత్రం ఇపుడు పార్టీ లోపల, బయటా తెగ వైరల్ అవుతున్నాయి.

ఆరున్నర పదుల వయసులోనూ అయ్యన్నలో ఫైర్ తగ్గలేదని కామెంట్లు చేస్తున్నారు.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube