ముందు.. టీడీపీలోంచి బ‌య‌టప‌డాలి.. ఆ నేత మ‌నోభావం

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయాలు ఊపందుకున్నాయి.నేత‌లు త‌మ ఫ్యూచ‌ర్‌ను చ‌క్క‌బెట్టుకు నే ప‌నిలో బిజీగా మారిపోయారు.

 Tdp Leader Anam Ramanarayana Reddy To Quit Party-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ వారు స‌ద్వినియోగం చేసుకుంటున్నారు.గెలుపు గుర్రం ఎక్కుతుంద‌ని భావిస్తున్న పార్టీలోకి జంప్ చేసేందుకు నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఈ క్ర‌మంలో ఎన్ని క‌ష్టాలు ఎదురైనా త‌ట్టుకునేందుకు రెడీ అవుతున్నారు.తాజాగా నెల్లూరులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఆనం సోద‌రుల్లో చిన్న‌వాడైన ఆనం రామ‌నారాయ‌ణరెడ్డి.

త్వ‌ర‌లోనే వైసీపీలోకి జంప్ చేయాల‌ని భావిస్తున్నారు.దీనికి సంబంధించి ఇప్ప‌టికే చ‌ర్చ‌లు కూడా కొలిక్కి వ‌చ్చాయి.

వైసీపీ అధినేత జ‌గ‌న్‌తోనూ ఆనం చ‌ర్చలు జ‌రిపారు.త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను ఆయ‌న వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగానే గ‌తంలో జ‌గ‌న్‌పై చేసిన వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌ల‌కు ఆనం సారీ చెప్పిన‌ట్టు వైసీపీలోని అత్యంత విశ్వ‌స‌నీ య వ‌ర్గాల స‌మాచారం.అంతేకాదు, వైఎస్‌తో త‌న‌కు న్న అనుబంధాన్ని కూడా ఆనం ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నా రు.ఇక‌, ఇదే స‌మ‌యంలో 2014 ఎన్నిక‌లు, అప్ప‌టి ప‌రిస్థితుల‌ను చ‌ర్చించిన ఆనం.టీడీపీలోకి తాను, త‌న దివంగ‌త సోద‌రుడు వెళ్ల‌డాన్ని తీవ్ర‌మైన త‌ప్పుగా పేర్కొన్న‌ట్టు తెలిసింది.జీవితంలో ., ముఖ్యంగా రాజ‌కీయ జీవితంలో తాము చేసిన పెద్ద పొర‌పాటు ఏమైనా ఉంటే అది బాబుతో చేతులు క‌ల‌ప‌డ‌మేన‌ని ఆయ‌న వాపోయిన‌ట్టు స‌మాచారం.మొత్తంగా త‌మ కుటుంబం చేసిన పొర‌పాటును స‌రిదిద్దుకునేందుకు తాము వైసీపీలోకి చేరాల‌ని, గ‌తంలోవైఎస్‌తో ఎలాగైతే.క‌లిసి మెలిసి ముందుకు వెళ్లామో.అదేవిధంగా … ఇక‌పై కూడా తాను అలానే వైసీపీలో వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆనం వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఆత్మ‌కూరు లేదా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న ట్టు జ‌గ‌న్‌కు వెల్ల‌డించారు.

అయితే, జ‌గ‌న్ మాత్రం ఈ విష‌యంలో ఖచ్చిత‌మైన హామీని ఇవ్వ‌లేక పోయారు.ఆనం రాక‌తో పార్టీకి మ‌రింత బ‌లం చేకూరుతుంద‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు.అయితే, ఎన్నిక‌ల్లో సీటుపై మాత్రం ఆయ‌న స‌రైన హామీ ఇవ్వ‌లేక పోయారు.దీనిపై ఆనం ఎలాంటిస్పంద‌న క‌న‌బ‌ర‌చ‌లేక‌పోయార‌ని స‌మాచారం.

అయిన‌ప్ప‌టికీ.తాను వైసీపీలోకి చేరితీరుతాన‌ని ఆయ‌న అనుచ‌రుల వ‌ద్ద తాజాగా వెల్ల‌డించారు.

టీడీపీలో ఉండి అవ‌మానాలు ప‌డే, అడుగ‌డుగునా నిఘా నీడ‌లో బ‌తిక బ‌దులు.వైసీపీలో చేరి జ‌గ‌న్ ఎక్క‌డ టికెట్ ఇస్తే.

అక్క‌డ పోటీ చేస్తాన‌ని.త‌న కృషి ప‌ట్టుద‌ల‌తోనే విజ‌యం సాధిస్తాన‌ని ఆనం చెప్పిన‌ట్టు తాజాగా తెలుస్తోంది.

మొత్తానికి ఆయ‌న‌లో టీడీపీ నుంచి వెంట‌నే బ‌య‌ట‌కు రావాల‌న్న క‌సి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు అనుచ‌రులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube