ఏపీ లో టీడీపీ కి మరో భారీ పంక్చర్...పార్టీని వీడనున్న అంబికా కృష్ణా

ఏపీ లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి ఆ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ పడుతూ కనీసం కోలుకొనే సమయం కూడా లేకుండా నానా ఇబ్బందులు పడుతుంది.ముహూర్త బలమో లేదా మరేదైనా కారణమో తెలియదు కానీ గత కొద్దీ రోజులుగా ఆ పార్టీ కి మాత్రం ఊపిరి తీసుకోలేని రేంజ్ లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

 Tdp Leader Ambika Krishna All Set To Jump Into The Bjp Party 1tstop-TeluguStop.com

మొన్నటికి మొన్న రాజ్యసభ ఎంపీ లు బీజేపీ లోకి జంప్ అవ్వడమే కాకుండా రాజ్యసభ లో టీడీపీ ని బీజేపీ లో కలిపేయాలి అంటూ ఆ నలుగులు ఎంపీలు రాజ్యసభ అధ్యక్షుడిని కోరిన సంగతి తెలిసిందే.అలానే ప్రజావేదికను ఏపీ జగన్ సర్కార్ లాక్కోవడమే కాకుండా దాని నిర్మాణంలో అవినీతి జరిగింది అంటూ ఆరోపణలు రావడం ఇలా వరుసగా సమస్యలు ఆ పార్టీ ని నిలవనీయడం లేదు.

అయితే ఇప్పుడు తాజగా ఆపార్టీ కీలక నేత,మాజీ ఎమ్మెల్యే, ఏపీ ఎఫ్ డీ సి చైర్మన్ అయిన అంబికా కృష్ణ జెండా ఎత్తేస్తున్నట్లు తెలుస్తుంది.ఆయన టీడీపీ కి గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన అంబికా కృష్ణ ఇవాళ టీడీపీకి గుడ్ బై చెప్పి, ఢిల్లీలో బీజేపీ నేత రామ్ మాధవ్ సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు.అంబికా కృష్ణతోపాటూ ఆయన సోదరుడు అంబికా రాజా కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు.

-Telugu Political News

మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అట్టర్ ఫ్లాప్ అవ్వడం, 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకోవడంతో ఇక టీడీపీ పనైపోయిందని భావిస్తున్న అంబికా కృష్ణ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఏపీ లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చాలా రోజులుగా సాగుతుంది అన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే టీడీపీ ముఖ్యమైన నేత అంబికా కృష్ణ ఆ పార్టీ లోకి జంప్ అవ్వడం తో ఇక టీడీపీ కి భారీ పంక్చర్ పడినట్లై అని విశ్లేషకులు చెబుతున్నారు.ఇంకా ముందు ముందు ఎంతమంది టీడీపీ కి గుడ్ బై చెప్పి కాషాయ కండువా పుచ్చుకుంటారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube