ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల( AP Elections ) దగ్గర పడే కొలది ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.పార్టీ అధిష్టానాలు టికెట్లు కేటాయించని పరిస్థితి ఉన్న క్రమంలో నేతలు ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు.
ఈ రకంగా ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నాయకులు ఇతర పార్టీలలో జాయిన్ కావడం జరిగింది.ఇదిలా ఉంటే తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) 3 వంతుల సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు రిపబ్లిక్ డే స్పీచ్ లో తెలియజేశారు.
కానీ చంద్రబాబు అన్ని సీట్లు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు అని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే కొన్నిచోట్ల జనసేన పార్టీకి చంద్రబాబు( Chandrababu ) సీట్లు కేటాయించినట్లు వార్తలు రావడంతో తెలుగుదేశం నేతలు పార్టీని వీడటానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ రకంగానే తెనాలి టికెట్ జనసేనకు కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ పరిణామంతో సీనియర్ నేత ఆలపాటి రాజాకే టికెట్ కేటాయించాలని టీడీపీ నేతలు( TDP Leaders ) డిమాండ్ చేస్తున్నారు.
అలా కాకుంటే ముక్కుమ్మడి రాజీనామాలకు సిద్ధపడతామని తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి హెచ్చరికలు చేస్తున్నారు.ఈ విషయం నడుస్తూ ఉండగానే పార్టీ కన్న తల్లి లాంటిది అని అన్యాయం చేయదనే నమ్మకంతో తాము ఉన్నట్లు రాజా తెలియజేయడం జరిగింది.
ఇదే సమయంలో కార్యకర్తలు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని.అన్నారు.ఈనెల ఎనిమిది తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని కార్యకర్తలతో తెలియజేయడం జరిగింది.