టీడీపీ అధ్యక్ష పదవికి అచ్చెన్న పెట్టిన షరతు ఏంటి ?

త్వరలోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నియామకాన్ని చేపట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.ఆయన అయితేనే పార్టీ సమర్థవంతంగా ముందుకు నడిపించగలరని ఆశాభావం లో బాబు ఉన్నారు.

 Tdp Leader Achhennaidu Conditions And Demands On Tdp Ap President Post, Achhem N-TeluguStop.com

కానీ ఎక్కువగా హైదరాబాద్ లోని తన నివాసానికి పరిమితమైపోవడంతో, ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే పరిస్థితి కనిపించడం లేదు.అలాగే వైసీపీ ప్రభుత్వం దూకుడు ఎక్కువగా ఉండటం, పార్టీ నాయకుల్లో భయాందోళనలు పెరిగిపోతుండటం వంటి సంఘటనలతో త్వరలోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడుని మార్చి అచ్చెన్న కు ఆ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు.

మామూలుగానే దూకుడు స్వభావంతో ఉండే అచ్చెన్న ఎవరి మాట పెద్దగా లెక్క చేయరు.అయితే తాను ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి పార్టీని పరుగులు పెట్టించాలంటే తన నిర్ణయాలకు ఎవరు అడ్డు చెప్పకూడదని, ఎవరి జోక్యం లేకుండా ఉంటేనే తాను ఆ పదవి చేపడతానని చెప్పినట్లుగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.

అయితే ఇదంతా చంద్రబాబు తనయుడు లోకేష్ ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు అనే ప్రచారం జరుగుతోంది.రానున్న రోజుల్లో పార్టీ పూర్తి బాధ్యతలను లోకేష్ కు అప్పగించాలనే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ మేరకు ఆయనకు అన్ని రకాలుగానూ ట్రైనింగ్ ఇప్పి స్తూ,  ఎటువంటి లోపాలు లేకుండా చూస్తున్నారు.

Telugu Achhem, Ap Cm Jagan, Ap Tdp Achhem, Chandrababu, Kala Venkatrao, Lokesh-P

గతంతో పోలిస్తే లోకేష్ పనితీరు కాస్త మెరుగుపడిన ట్టు గానే కనిపిస్తోంది.కానీ పార్టీ నాయకుల్లో ఆయన పై పూర్తి స్థాయిలో నమ్మకం లేదు.లోకేష్ కనుక పూర్తిగా పార్టీని లీడ్ చేస్తే, ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందని, వైసీపీ ని ఎదుర్కోవడం అటుంచి కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

పార్టీ సీనియర్ నాయకుల్లోనే ఆయన పనితీరుపై తీవ్ర అసంతృప్తి ఉంది.కేఈ కృష్ణమూర్తి, బుచ్చయ్య చౌదరి వంటి నాయకులు అప్పుడప్పుడు బహిరంగంగానే లోకేష్ పనితీరుపై విమర్శలు చేస్తూ ఉంటారు.

అసలు లోకేష్ నాయకత్వంలో పని చేసే కంటే, పూర్తిగా రాజకీయాల నుంచి తప్పు కుంటేనే బెటర్ అనే అభిప్రాయం లోనూ చాలామంది నాయకులు ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో అచ్చెన్న ఈ విధంగా వ్యవహరించడం పెద్ద వింతేమీ కాదు.

ప్రస్తుత టిడిపి ఏపీ అధ్యక్షుడు కళావెంకట్రావు విషయంలోనూ లోకేష్ ఇదే విధంగా వ్యవహరించడం, ఆయనను పూర్తిగా డమ్మీ చేయడం వంటి కారణాలతో, తనకు అదే పరిస్థితి రాకుండా ఇప్పటి నుంచే అచ్చెన్న ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube