వైసీపీలోకి టీడీపీ కీల‌క మ‌హిళా నేత‌... ఆప‌రేష‌న్ స‌క్సెస్‌..!

రాజ‌కీయాల్లో గ‌త ఇర‌వై ఏళ్లుగా చంద్ర‌బాబును న‌మ్ముకుని అల‌సిపోయిన ఓ మ‌హిళా నేత ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నార‌ట‌.ఆ మ‌హిళా నేత ఎవ‌రో కాదు మాజీ స్పీక‌ర్‌, టీడీపీ వీర విధేయురాలు కావ‌లి ప్ర‌తిభా భార‌తి.

 Tdp Key Women Leader In Ysrcp, Tdp, Ysrcp, Prathiba Bharathi, Tdp Women Leader,-TeluguStop.com

ఆమె త్వ‌ర‌లోనే సైకిల్ దిగేయ‌డం ఖాయ‌మంటున్నారు.ఆమె రాజ‌కీయాల్లోకి వ‌చ్చి రెండున్న‌ర ద‌శాబ్దాలు దాటింది.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న తాజా ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లు పార్టీలోనే క‌ల‌క‌లం రేపుతున్నాయి.

రాజ‌కీయాల్లో అనేక అవ‌కాశాలు వ‌స్తాయి.

అప్పుడు ఉండాలా ?  వెళ్లాలా ? అన్న‌ది మ‌న‌మే డిసైడ్ చేసుకోవాలంటూ ఆమె చేసిన ప్ర‌క‌ట‌నే ఆమె పార్టీలో ఉండేందుకు ఇష్టంగా లేర‌న్న విష‌యం స్ప‌ష్టం చేస్తోంది.త‌న కుమార్తె గ్రీష్మ భ‌విష్య‌త్తు కోస‌మే ప్ర‌తిభా భార‌తి 2004, 2009, 2014 మూడు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా ఓడిపోతూ వ‌స్తోంది.2014 ఎన్నిక‌ల్లో ఆమె గెలిచి ఉంటే ఆమెకు ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి వ‌చ్చి ఉండేది.అయితే స్వ‌ల్ప తేడాతో ఆమె ఓడిపోయారు.

Telugu Chandrababu, Kavali, Akarsh, Tdp, Ysrcp-Telugu Political News

జిల్లాలో క‌ళా వెంక‌ట‌రావు, కింజారాపు ఫ్యామిలీలు ప్ర‌తిభా భార‌తి రాజ‌కీయ ఎదుగుల‌ను అణ‌గ‌దొక్కేందుకే తెర‌వెన‌క ప్ర‌య‌త్నాలు చేస్తూ ఆమెను ఓడిస్తున్నార‌న్న టాక్ కూడా ఉంది.నాడు అసెంబ్లీలో దివంగ‌త మాజీ సీఎం రాజ‌శేఖ‌ర్‌రెడ్డితోనే ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో వ్య‌వ‌హ‌రించి మంచి పేరు తెచ్చుకున్నారు.పార్టీ కోసం ఎన్ని చేసినా చంద్ర‌బాబు ఆమెను ప‌క్క‌న పెట్ట‌డాన్ని ఆమె జీర్ణించుకోలేక‌పోతున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ప్ర‌తిభ కుమార్తె గ్రీష్మ‌కు సీటు ఇస్తాన‌ని చివ‌రి వ‌ర‌కు ఊరించి చివ‌ర్లో జంపింగ్ నేత కొండ్రు ముర‌ళీకి సీటు ఇచ్చారు.

ఇప్పుడు పార్టీలో ఉన్నా పార్టీకి.అటు త‌న కుమార్తె రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు ఉప‌యోగం లేద‌ని భావించే ఆమె పార్టీ మారుతున్నార‌ట‌.ఇప్ప‌టికే ఆమెకు వైసీపీ నుంచి పిలుపు వ‌చ్చింద‌ని.ఆమెతో వైసీపీ నేత‌ల మంత‌నాలు కూడా పూర్త‌య్యాయ‌ని.

ఆమె ఎప్పుడు అయినా సైకిల్ దిగిపోవ‌చ్చ‌ని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube