అందరి టార్గెట్ జగనే ? ఏంటి ఈ పరిస్థితి ?

ప్రజా సంక్షేమ పథకాలతో వైసీపీ ప్రభుత్వం ఎంత ఇమేజ్ జనాల్లో పెంచుకుంటుందో అంతే స్థాయిలో రాజకీయ ప్రత్యర్థుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కుంటోంది.ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంలో, ప్రతి నిర్ణయం లో సూక్ష్మ లోపాలను సైతం వెతికి పట్టుకుని ప్రజల్లో హైలెట్ చేస్తూ, వైసీపీ ప్రభుత్వం ఇమేజ్ ను తగ్గించే విషయంలో వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు అంతా సక్సెస్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నారు.

 Pavan Kalyan Janasena Ysrcp Jangan Ap Bjp Lokesh Chandrababu Nara , Ys Jagan, Ys-TeluguStop.com

విమర్శలను తిప్పి కొట్టడం లో వైసిపి నాయకులు స్పందించాల్సిన స్థాయిలో స్పందించకపోవడం, అడ్డగోలు వాదనలకు దిగుతూ ఉండడం వంటివి జగన్ ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరంగా మారింది.

బిజెపి, టిడిపి, జనసేన, వామపక్ష పార్టీలు ఇలా అందరూ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

ఒకవైపు టీడీపీ యువ నాయకుడు లోకేష్ సైతం వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతుండడమే కాకుండా, రైతుల్లో వైసీపీ గ్రాఫ్ చేసుకునేందుకు, రైతుల్లో వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగే విధంగా పంట నష్టపోయిన ప్రాంతాలను, వరద ముంపు ప్రాంతాలను పరామర్శిస్తూ హడావుడి చేస్తుండగా, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అంటూ హడావుడి చేస్తున్నారు.

Telugu Chandrababu, Farmers, Scheems, Gudiwada, Jagan, Janasena, Janasenani, Kod

ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.ఇటీవల జనసేన ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా గుడివాడ లో పవన్ వైసీపీ మంత్రులను ఉద్దేశించి పెద్ద ఎత్తున విమర్శలు చేయడమే కాకుండా జగన్ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఒకవైపు పవన్ , మరోవైపు లోకేష్ రైతులను పరామర్శిస్తూ, పొలాల్లోకి దిగి మరీ హడావుడి చేస్తూ రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే కార్యక్రమంలో సక్సెస్ అవుతూ వస్తున్నారు.

Telugu Chandrababu, Farmers, Scheems, Gudiwada, Jagan, Janasena, Janasenani, Kod


ప్రజల్లో వైసిపికి వ్యతిరేకత పెంచే విషయంలో క్రమక్రమంగా సక్సెస్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు.త్వరలోనే తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు, జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో, ఈ విధంగా జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచే కార్యక్రమానికి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు శ్రీకారం చుట్టినట్లు గా కనిపిస్తున్నాయి.ఇవన్నీ జగన్ ప్రభుత్వంపై జనాల్లో కాస్తో కూస్తో వ్యతిరేకత భావం కలిగేలా చేస్తాయి అందంలో సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube