చివరికి టీడీపీ జనసేన ఇలా ' ఫిక్స్ ' అయిపోయారా ?

జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.2014 ఎన్నికల్లో జనసేన ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా టిడిపి బిజెపి కూటమికి మద్దతు పలికింది.వైసీపీకి వ్యతిరేకంగా పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అప్పుడు వచ్చిన ఫలితాలతో టిడిపి అధికారం దక్కించుకోగలిగింది.ఆ క్రెడిట్ చాలావరకు పవన్ కు దక్కుతుంది.అయితే 2019 ఎన్నికల సమయం నాటికి సీన్ మొత్తం మారిపోయింది.

 Alliance Talks Between Tdp And Janasena, Pawan Kalyan, Chandra Babu Naidu, Allia-TeluguStop.com

టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కోసం జనసేన ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం , ఘోర పరాజయాన్ని చవి చూడడం తదితర కారణాలతో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది.అయినా ఆ పార్టీ వల్ల పెద్దగా తమకు కలిసి రావడం లేదనే విషయాన్ని పవన్ ఎప్పుడో గుర్తించిన చేసేది లేక ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్తున్నారు.


ఇక టిడిపి విషయానికి వస్తే మొదటి సారి ఎన్నికల వెళ్లి ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2019 ఎన్నికల ఫలితాలు తరువాత క్యాడర్ చెల్లాచెదురుగా మారడం, బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా, ఆ పార్టీ దూరం పెడుతుండటం తదితర కారణాలతో మళ్లీ అధికారంలోకి రావాలంటే ఏదో ఒక పార్టీ అండదండలు ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు.

ఇదే ఆలోచనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండడంతో ఈ రెండు పార్టీలు మళ్లీ పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వద్దకు రాయబారం పంపినట్లు తెలుస్తోంది.


Telugu Alliance, Alliancetdp, Ap, Chandra Babu, Chandrababu, Janasena, Janasenan

జనసేన, టిడిపి మళ్లీ కలిస్తేనే వైసీపీ కి అధికారం దక్కకుండా చేయవచ్చని, పవన్ పై చంద్రబాబు ఒత్తిడి చేస్తుండటంతో, పవన్ సైతం టిడిపితో పొత్తు విషయమై ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారట.ఎలాగూ బీజేపీతో వర్కవుట్ అయ్యే పరిస్థితి లేకపోవడం, వైసీపీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేకపోవడం తదితర కారణాలతో టీడీపీతో పొత్తుకు పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube