శ‌నివారం వ‌స్తే టెన్ష‌న్ ప‌డుతున్న టీడీపీ.. కానీ కోర్టుకు మాత్రం వెళ్ల‌రు!

ఏపీలో వైసీపీకి టీడీపీకి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత‌గా రాజ‌కీయాలు ర‌గులుతున్నాయి.టీడీపీ నేత‌ల‌పై ఎప్పుడు ఎవ‌రిమీద వేటు ప‌డుతుందో అని టెన్ష‌న్ ప‌డుతున్నారు.

 Tdp Is In Tension On Saturday But Do Not Go To Court-TeluguStop.com

ఇప్ప‌టికే అరెస్టుల ప‌ర్వంతో టీడీపీ ర‌గిలిపోతోంది.ఎప్పుడు ఎవ‌రు అరెస్టు అవుతారో అని అంతా మ‌ద‌న‌ప‌డుతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్ర‌భ‌త్వం టీడీపీ నేత‌ల అక్ర‌మ లేఅవుట్ల నిర్మానాల‌పై ఫోక‌స్ పెట్టింది.

 Tdp Is In Tension On Saturday But Do Not Go To Court-శ‌నివారం వ‌స్తే టెన్ష‌న్ ప‌డుతున్న టీడీపీ.. కానీ కోర్టుకు మాత్రం వెళ్ల‌రు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వ‌రుస‌పెట్టి టీడీపీ నేత‌ల‌కు చెందిన అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను కూల్చివేస్తున్నారు అధికారులు.

మ‌రీ ముఖ్యంగా శ‌నివారం వ‌స్తుందంటే చాలు శుక్ర‌వారం అర్ధ‌రాత్రి దాటాక అధికారులు జేసీబీలు, బుల్డోజర్లతో స‌హా వ‌చ్చి మ‌రీ నిర్మాణాల‌ను నేల‌మ‌ట్టం చేస్తున్నారు.దీంతో టీడీపీ నాయ‌కులు భ‌గ్గుమంటున్నారు.

ఎలా కూలుస్తారంటూ గొడ‌వ‌కు దిగుతున్నారు.అయినా స‌రే ప్ర‌భుత్వం మాత్రం కూల్చివేత‌ల‌పై వెన‌క్కు త‌గ్గ‌ట్లేదు.

ఈ విష‌యంలో అధికారులు ఇప్ప‌టికే టీడీపీకి చెందిన గీతం విశ్వవిద్యాలయం ఎమ్మెల్యే అయిన వెలగపూడి రామకృష్ణ కు చెందిన నిర్మాణాల‌ను కూల్చేశారు.అలాగే పల్లా శ్రీనివాస్, సబ్బంహరి, ఇత‌ర ముఖ్య నాయ‌కుల‌కు చెందిన అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను నేల‌మ‌ట్టం చేస్తున్నారు అధికారులు.

ఇక రీసెంట్‌గా పల్లా శ్రీనవాసరావు సోద‌రుడైన పల్లా శంకర్ రావుకు చెందిన కొన్ని బిల్డింగుల‌ను కూడా నేల‌మ‌ట్టం చేశారు అధికారులు.అయితే వీటిపై టీడీపీ వివాదానికి మాత్ర‌మే దిగుతోంది.

కానీ కోర్టుకు వెళ్లి న్యాయ‌పోరాటం చేయ‌ట్లేదు.దీంతో అవ‌న్నీ నిజంగానే అక్ర‌మ క‌ట్ట‌డాల‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు.

Telugu @tdptrending, Ap And Ycp-Telugu Political News

ఒక‌వేళ నిజంగా స‌క్ర‌మంగా క‌ట్టి ఉంటే ఎందుకు కోర్టుకు వెళ్ల‌ట్లేద‌నే వాద‌న కూడా ఉంది.పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇది కూడా నిజ‌మ‌నే అనిపిస్తుంది.అధికారులు కూల్చివేస్తున్నా వీటిపై సింప‌తీ కోసం గోల చేస్తున్నారే కానీ కోర్టుల‌కు వెళ్ల‌క‌పోవ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం.మ‌రి వ‌చ్చే శ‌నివారం ఎవ‌రిపై వేటు ప‌డుతుందో చూడాలి.ఏదేమైనా రాజ‌కీయాల్లో క‌క్ష్య‌సాధింపు చ‌ర్య‌లు ప‌రిపాటిగా మారిపోతున్నాయి.

#AP And YCP #@tdptrending

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు