తిరుప‌తి కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ పని గోవిందా.. ?

ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఊవ్విళ్లూరుతున్న టీడీపీకి ఊహించని షాక్ తగిలింది.ఇప్పటికే టీడీపీ ఏపీలో అనాధపార్టీగా మారుతున్న క్రమంలో సైకిల్‌ను శ్రమనంతా కూడగట్టుకుని, చిన్న బాబు, పెద్దబాబు చెమట్చోడ్చుతూ ముందుకు తీసుకెళ్లుతున్నారు.

 Tdp-in-tirupati-corporation-elections Tirupati, Corporation Elections, Tdp, Ycp-TeluguStop.com

అయినా గానీ పార్టీ శ్రేణులు అర్ధం చేసుకోకుండా వలసబాట పట్టారు.ఈ నేపధ్యంలో ప్రస్తుతం తిరుప‌తి కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ డీలా పడి, పసలేకుండా మారిందట.

ఇకపోతే తిరుప‌తి కార్పొరేష‌న్ ఎన్నికలను రెండు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.కానీ టీడీపీ మాత్రం క‌నీసం స‌గం డివిజ‌న్లలో కూడా పోటీ చేయ‌లేని ద‌య‌నీయ స్థితిలోకి జారిపోయిందట.

అదీగాక టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని విధాలా ల‌బ్ధి పొందిన నాయ‌కులు, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మొహం చాటేసినట్లు సమాచారం.దీంతో ఇక్కడి సీట్లు వైసీపీ ఖాతాలోకి పోయినట్లే అని అంటున్నాయి పార్టీ వర్గాలు.

ఇక ఏపీలో తెగహడావుడి చేస్తున్న చంద్రబాబుకు ఇది ఊహించని దెబ్బ అని అనుకుంటుండగా, పార్టీశ్రేణుల కష్టాలు పట్టించుకుంటే కనీస డిపాజిట్లు అయినా దక్కేవి అని మరికొందరు సలహాలు ఇస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube