తెలంగాణలో టీడీపీ కథ ముగిసినట్టే     2017-10-18   03:50:20  IST  Bhanu C

ఎప్పటినుండో పాతుకుపోయిన కాంగ్రెస్ హవా తగ్గించి తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో ఎన్ఠీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ అంటే అప్పట్లో జాతీయ పార్టీలకి వణుకు పుట్టేది..ఒక్క ఆత్మ గౌరవం నినాదంతో వచ్చి సంచలనాలు సృష్టినిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ..ఇప్పుడు మెల్ల మెల్లగా ఉనికిని కోల్పోయే పరిస్థితికి వచ్చేసింది..అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..రాష్ట్రం విడిపోనప్పుడు చాలా బలంగా ఉన్న టీడీపీ తెలంగాణా రాష్ట్రం నుంచీ విడిపోయాక తెలంగాణా రాష్ట్రంలో ఒడిదుడుకులు ఎదుర్కుంటోంది. టిడిపి నుంచీ ఒక్కొక్కరుగా గులాబీ కండువా కప్పుకోవాడంతో..ఆందోళన చెందుతున్నారు చంద్రబాబు.

ఏపీలో ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీడీపీలో చేర్చుకుంటుంటే…. తెలంగాణలో ఈ సీన్ టిడిపిలో జరుగుతొంది.. తెలంగాణలో ఇప్పుడు టిడిపి పార్టీని నడిపించే నేత కరువయ్యాడు. టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న వార్తలు వస్తుండటంతో ఆ పార్టీలో ఉన్న కొద్ది మంది నేతలు ఆందోళనలో ఉన్నారు. వారికి చంద్రబాబు నుంచి ఎటువంటి భరోసా లభిస్తుందోనని వేచి చూస్తున్నారు. ఎవరు ఎప్పుడు పార్టీని వీడతారో తెలియని స్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాస్తో కూస్తో సీట్లను గెలుచుకుని తమకూ ఇక్కడ ఓటు బ్యాంకు ఉందని నిరూపించుకున్న తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ తో కుదేలయింది. టీడీపీ నుంచి ఎన్నికైన 12 మంది ఎమ్మెల్యేలు కారెక్కేశారు.

ఇక మిగిలింది ముగ్గురు..వారిలో కూడా ఒక్కరు వారిలో ఆర్. కృష్ణయ్య పార్టీని, అంతే తప్ప ఏరోజూ పార్టీ కార్యాలయానికి రారు. ఇక మిగిలింది ఇద్దరే ఎమ్మెల్యేలు.ఇప్పుడు మిగతా ఇద్దరిలో కూడా ఒకరైన రేవంత్ రెడ్డి పార్టీని వీడితే ఇక టిడిపి తట్టా బుట్టా సద్దేసినట్టే రెంవంత్ రెడ్డి..ఐతే ఇందులో మరొక విషయం ఏమిటి అంటే చంద్రబాబు తెలంగాణలో పార్టీని బ్రతికించుకోవడానికి ఏదన్నా చేయగల సమర్ధుడు చంద్రబాబు..అందుకోసమే టీఆరెస్ తో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని కనీసం పార్టీని బ్రతికించుకునే పనిలో పడ్డాడు ..టీఆరెస్ తో పొత్తువిషయం తెలిసినపుడే రేవంత్ టీడీపీకి దూరం అవ్వడం మొదలుపెట్టాడు అని టాక్. ప్రస్తుతం ఉన్న పరిణామాల దృష్ట్యా తెలంగాణలో టీడీపీ అడ్రస్ గల్లంతు అవ్వడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.