జగన్ ను పక్క రాష్ట్రం మంత్రి అంత మాట అన్నారా ? వైరల్ చేస్తున్న టీడీపీ ?

ఈ మధ్యకాలంలో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఓ రేంజ్ లో ట్రోల్ అవుతున్నారు.ఏపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో జగన్ పేరు మొదట్లో మారుమోగింది.

 Tdp Hilet On Telangana Minister Puvvada Ajay Comments About Jagan , Ap Cm Jagan,-TeluguStop.com

ఇప్పుడు అవే పథకాలు, నిర్ణయాలు జగన్ కు తల నొప్పులు తీసుకొస్తున్నాయి.అంతేకాకుండా ప్రతిపక్షాలతో పాటు, పక్క రాష్ట్రాల రాజకీయ నాయకులు విమర్శలు చేసే వరకు పరిస్థితి వెళ్లింది.

కొద్దిరోజుల క్రితమే తెలంగాణ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ లో జగన్ పాలన పై పరోక్షంగా ఎద్దేవా చేశారు.

ఏపీలో నరకప్రాయం అని, కరెంటు సరిగా ఉండదని, రోడ్ల పరిస్థితి దారుణం అంటూ ఓ సందర్భంలో చెప్పారు.

దానిపై పెద్ద రాద్ధాంతం జరిగింది.టిడిపి, జనసేన వంటి పార్టీలు కేటీఆర్ విమర్శలను హైలెట్ చేస్తూ.

జగన్ పైమరింత విమర్శలు చేశాయి.తాజాగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జగన్ ను ఉద్దేశించి పరోక్షంగా చేసిన విమర్శలు ఇప్పుడు టిడిపి వైరల్ చేస్తోంది.

Telugu Ap Cm Jagan, Jagan Davos, Ktr Davos, Telugudesam-Politics

ప్రస్తుతం దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతోంది.ఈ సదస్సుకు ఏపీ నుంచి సీఎం జగన్ , మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.దీనిని ఉద్దేశించి మంత్రి పువ్వాడ అజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.దావోస్ లో కేటీఆర్ అడుగు పెట్టిన రోజే దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడులు వచ్చాయని, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కనీసం ఈగ వాలిన దాఖలు లేవు అంటూ ఎద్దేవా చేశారు.ఇప్పుడు ఏ వ్యాఖ్యలనే టిడిపి వైరల్ చేస్తోంది.

విదేశాల్లో కూడా జగన్ పరువు పోయిందని, జగన్ ను ఉద్దేశించి మంత్రి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ జగన్ పై టిడిపి సెటైర్లు వేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube