ఏపీలో ఆ జిల్లాల్లో టీడీపీ పుంజుకుందా... !  

టెక్నిక‌ల్‌గా ఓడిపోయినా.నైతికంగా .

TeluguStop.com - Tdp Guntur District Ap Politics

బాగానే ఉన్న జిల్లాల్లోనూ టీడీపీ వెనుకంజ‌లో ఉంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.నిజ‌మే! గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ బ‌లంగానే ఉంద‌ని.

గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు.అందుకే నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ల కోసం పోటీ ప‌డ్డారు.

TeluguStop.com - ఏపీలో ఆ జిల్లాల్లో టీడీపీ పుంజుకుందా… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే.వైసీపీ గాలిలో నేత‌ల త‌ల‌‌రాత‌లు త‌ల‌కిందుల‌య్యాయి.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి, విశాఖ‌, కృష్ణా, ప్ర‌కాశం, క‌ర్నూలు, అనంత‌పురం వంటి జిల్లాల్లో టెక్నిక‌ల్‌గా టీడీపీ ఓడిపోయింది.

కానీ, నైతికంగా చూస్తే.ఏడు జిల్లాల్లోనూ బ‌ల‌మైన నాయ‌కత్వం, నాయ‌కులు , ఓటు బ్యాంకు చెక్కు చెద‌ర లేద‌నే చెప్పాలి.మ‌రీ ముఖ్యంగా గుంటూరులో అయితే పార్టీ ఇంకా బ‌ల‌ప‌డింద‌నే అనాలి.రాజ‌ధాని ఎఫెక్ట్ కావొచ్చు.చంద్ర‌బాబుపై సానుభూతి, జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త కావొచ్చు.మొత్తంగా చూస్తే.

గుంటూరులోనూ పార్టీకి సానుకూల ప‌వ‌నాలు బాగానే ఉన్నాయి.ఇక‌, మిగిలిన జిల్లాల్లో ప‌రిస్థితిని చూస్తే.

వైసీపీపై అక్క‌డ పెట్టుకున్న ఆశ‌లు నేతిబీర‌నే త‌ల‌పిస్తున్నాయి.ఎక్క‌డిక‌క్క‌డ గొడ‌వ‌లు, నేత‌లు వీధుల్లోకి ఎక్క‌డం వంటివి వైసీపీకి మైన‌స్‌గా మారాయి

ఈ క్ర‌మంలోనే చాలా జిల్లాల‌లో టీడీపీకి మ‌ళ్లీ మొగ్గు క‌నిపిస్తోంది.అయితే.ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్ర‌మే.

ఎంత సానుకూల‌త ఉన్న‌ప్ప‌టికీ.దీనిని అందిపుచ్చుకునేలా టీడీపీ వ్య‌వ‌హ‌రించాలి క‌దా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.కానీ, ఆయా జిల్లాల్లో నాయ‌కులు ముందుకు రావ‌డం లేదు.అలాగ‌ని అంద‌రినీ అన‌లేం కానీ. మెజారిటీ నాయ‌కులు బ‌య‌టకు రావ‌డం లేదు.ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డ‌మూ లేదు.

పైగా జ‌నాల్లోకి కూడా వెల్ల‌డం లేదు.ఈ ప‌రిణామం గ‌మ‌నిస్తే.

టీడీపీ బాగున్నా.వెనుక‌బ‌డే ఉంద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.

మ‌రి ఈ ప‌రిస్థితి ఎప్ప‌టికి మారుతుందో ? చూడాలి.

#Chandrababu #YS Jagan #Guntur #AP Capital #AP Politics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు