ఏపీలో టీడీపీ హ‌యాం నాటి ఊపేది..?  హుషారెక్క‌డ‌...?

ఏమాకామాటే చెప్పుకోవాలి. టీడీపీ హ‌యంలో రాష్ట్రంలో ఒక హుషారు ఉండేది.

 Where Is That Tdp Government Josh.?, Andhra Pradesh,chief Minister,jagan Mohan R-TeluguStop.com

ఒక ఊపు ఉండేది.ఎక్క‌డో ఒక చోట నిత్యం ఏదో ఒక కార్య‌క్ర‌మం నిర్వ‌హించేవారు.

ఇక‌, వారాంతాలైన ఆదివారంలో అయితే, విజ‌య‌వాడ‌, విశాఖ‌, తిరుప‌తి, రాజ‌మండ్రి వంటి కీల‌క న‌గ‌రాల‌ను ఎంపిక చేసి.ర‌హ‌దారుల‌పై ప్ర‌భుత్వ‌మే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేది .దీనికి స్థానికంగా ఉన్న యువ‌త ఎక్కువ సంఖ్య‌లో పాల్గొనేలా చేసేవారు.దీంతో ఆదివారం వ‌స్తే.

చాలా రాష్ట్రంలో ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆట‌విడుపు కార్యక్ర‌మాలు కోకొల్ల‌లుగా జ‌రిగేవి.

ఇక‌, ద‌స‌రా వ‌స్తున్నా.

సంక్రాంతి పండ‌గ వ‌స్తున్నా.ఆ ఊపు అధిరిపోయే రేంజ్‌లో ఉండేది.

ఎక్క‌డిక‌క్కడ ప్ర‌జ‌ల‌కు వినోద కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేవారు.ఇక‌, న‌దుల‌కు పండ‌గ‌లైతే.

నిర్వ‌హించే తీరు మ‌రింత భిన్నంగా ఉండేది.న‌దుల‌కు హార‌తుల‌ని, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌నీ స‌ర్కారే హ‌డావుడి పెంచేది.

అదేస‌మ‌యంలో గాలిప‌టాల పండుగ‌కు విశాఖ కేంద్రంగా మారిపోయింద‌నే పేరు తెచ్చింది నాటి చంద్ర‌బాబు స‌ర్కారు.అదేస‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా క‌ళాకారుల‌కు చేతి నిండా ప‌ని ఉండేది.ప్ర‌భుత్వం త‌ర‌ఫున నాటక పోటీలు, ప‌ద్య పోటీలు.ఇలా భిన్నంగా నిర్వ‌హించేవారు.

Telugu Andhra Pradesh, Chandra Babu, Lokesh, Tdp, Ysrcp-Telugu Political News

కానీ, ఇప్పుడు వైసీపీ స‌ర్కారు ఆధ్వ‌ర్యంలో గ‌డిచిన ఏడాదిన్న‌ర‌గా ఏ ఒక్క‌కార్య‌క్ర‌మం ఇలాంటిది జ‌ర‌గ‌డం లేద‌ని అంటున్నారు ప్ర‌జ‌లు.త‌మ‌కు వినోద‌మే లేకుండా పోయింద‌ని ప‌ర్యాట‌కులు గ‌గ్గోలు పెడుతున్నారు.ఇప్పుడంటే.క‌రోనాతో అన్ని కార్య‌క్ర‌మాలు నిలిపివేసినా.దీనికి ముందు జ‌న‌వరిలో వ‌చ్చిన సంక్రాంతి కూడా చ‌ప్ప‌గానే సాగింద‌ని.ఇక‌, ద‌స‌రాకు ఆ ఊపే లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.
ప్ర‌భుత్వం ఎన్ని కార్య‌క్ర‌మాలు చేసినా.ప్ర‌జ‌లకు అంతో ఇంతో వినోదాన్ని పంచే ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు కూడా పెద్ద‌పీట వేయాల‌ని, మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాలు కాపాడే ప్ర‌య‌త్నం చేయాల‌ని వారి విన్న‌పం.

వీరి ఆలోచ‌న నిజ‌మేన‌ని అంటున్నారు సంప్ర‌దాయ ప్రేమికులు.ఎంత‌గా పాల‌న‌పైనే దృష్టి పెట్టినా.ప్ర‌జ‌ల‌కు వినోదం పంచే కార్య‌క్ర‌మాల‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాల‌ని సూచిస్తున్నారు.మ‌రి జ‌గ‌న్ వింటారా?  చూడాలి!!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube