పవన్‌ను ఎందుకు మర్చిపోయారు?

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు టీడీపీపై, ప్రత్యేకించి ఏపీ సీఎం చంద్రబాబుపై కోపంగా ఉన్నారు.కారాలు మిరియాలు నూరుతున్నారట.

 Tdp Gives Pawan Kalyan A Royal Ignore At Mahanadu-TeluguStop.com

వారికి ఇంత ఆగ్రహం కలలగడానికి కారణం టీడీపీ మహానాడులో పవన్‌ కళ్యాణ్‌ పేరు తలచుకోలేదట.టీడీపీ మహానాడుకు పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు వస్తాడు? ఆయన టీడీపీ సభ్యుడు కాదు.తాను ప్రత్యేకంగా జనసేన అనే పార్టీ పెట్టుకున్నాడు.పార్టీ సభ్యుడు కానివారిని మహానాడుకు పిలవరు కదా…! ఇది నిజమేగాని పవన్‌ చేసిన సహాయానికి టీడీపీ కృతజ్ఞత చూపించలేదనేది ఆయన అభిమానుల ఆరోపణ, ఆవేదన.

గత ఎన్నికల్లో పవన్‌ మద్దతు ఇచ్చిన కారణంగానే టీడీపీ గెలిచి అధికారంలోకి వచ్చిందని, కాబట్టి మహానాడులో ఆయనకు తగినరీతిలో కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందనేది పవన్‌ అభిమానుల వాదన.కోట్లాది రూపాయల ఖర్చుతో మహానాడును పండుగలా చేస్తున్నప్పుడు పవన్‌ కళ్యాణ్‌ను విస్మరించడం బాధాకరమని ఆయన అభిమానులు అంటున్నారు.

పార్టీ సభ్యులు, నాయకులు చంద్రబాబును ఆకాశానికి ఎత్తారని, కాని పవన్‌ గురించి ఒక్కమాటా మాట్లాడలేదని విమర్శిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube