టీడీపీ జెండాలు క‌న‌ప‌డ‌ట్లేదే... పార్టీని మ‌ర్చిపోయారా...!

ఈ టైటిల్ చూస్తే కాస్త అతియోశ‌క్తిగా ఉండొచ్చేమోగానీ.ఇది నిజం.

 Tdp Flags Are Not Flying..is People Forgot Tdp Party?, Ap, Andhra Pradesh, Polit-TeluguStop.com

ప్ర‌స్తుతం గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ప్ర‌చార పర్వం చూస్తే అలాగే అనిపిస్తోంది.తెలంగాణ‌లో టీడీపీకి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి ప‌త‌నం ప‌రాకాష్ట‌కు చేరుకుంది.

ఆ ఎన్నిక‌ల్లో ఎప్పుడు అయితే చంద్ర‌బాబు కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌ట్టారో ? అప్పుడు టీడీపీతో పాటు కాంగ్రెస్ కూడా మునిగింది.తెలంగాణ ఇచ్చిందన్న పేరు కూడా కాంగ్రెస్‌కు కూడా లేకుండా చేసేశారు బాబు.

ఇప్పుడు గ్రేట‌ర్లో ఏదో నామ్‌కే వాస్తేగా పోటీ పెట్టారు.సీమాంధ్ర ఓట‌ర్లు ఉన్న ప్రాంతాల్లో టీడీపీకి కొన్ని డివిజ‌న్ల‌తో పాటు మంచి సీట్లు అయిన వ‌స్తాయ‌న్న‌దే బాబు ఆశ కావొచ్చు.

కానీ ఇక్క‌డ ప్ర‌చారంలో ప‌రిస్థితి చూస్తే అస‌లు పోటీ చేస్తోన్న అభ్య‌ర్థులు ఎవ‌రో ఆ డివిజ‌న్ల‌లో ఉన్న ప్ర‌జ‌ల‌కే తెలియ‌ని ప‌రిస్థితి.గ‌తంలో కూక‌ట్‌ప‌ల్లిలోనో లేదా శేరిలింగంప‌ల్లి, స‌న‌త్‌న‌గ‌ర్ లాంటి చోట్ల టీడీపీకి కాస్తో కూస్తో అభిమానులు ఉండేవారు.

ఆ పార్టీకి జెండాలు అయినా క‌న‌ప‌డేవి.ఇప్పుడు ఒక్క‌టంటే ఒక్క టీడీపీ జెండా అయినా భూత‌ద్దంలోనూ క‌నిపించ‌ని ప‌రిస్థితి.

కాస్తో కూస్తో ప‌ట్టున్న‌ప్పుడే గ‌త గ్రేట‌ర్ ఎన్నికల్లో కేవ‌లం కేపీహెచ్‌బీ సీటుతో టీడీపీ స‌రిపెట్టుకుంది.అయితే అక్క‌డ గెలిచిన కార్పొరేట‌ర్ మందాడి స‌త్య‌నారాయ‌ణ టీఆర్ఎస్‌లోకి జంప్ చేసేసి.ఇప్పుడు టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీలో ఉన్నారు.

అస‌లు ఇప్పుడు ఆ పార్టీని ఇక్క‌డ జ‌నాలు గుర్తు పెట్టుకునే ప‌రిస్థితి కూడా లేనందున వాళ్ల‌కు ఓట్లు వ‌స్తాయ‌ని ఆశించ‌డం కూడా అత్యాశే.

చివ‌ర‌కు ఎవ్వ‌రూ ప‌ట్టించ‌కునే పరిస్థితి లేక‌పోవ‌డంతో ఆ పార్టీకి కొమ్ముకాసే మీడియా వాళ్లు మాత్రం కొంత వ‌ర‌కు భుజానకు ఎత్తుకుని పార్టీ త‌ర‌పున వాళ్లే ప్ర‌చారం చేస్తున్నారు.ఇక టీడీపీ తెలంగాణ సోష‌ల్ మీడియా వాళ్లు అయితే త‌ల‌సాని లాంటి వాళ్లు గ‌తంలో చంద్ర‌బాబును పొగిడిన వీడియోలు ఇప్పుడు ప్లే చేసుకుంటూ కాలం గ‌డుపుతున్నారు.

రోజూ ఏపీ నాయ‌కుల‌తో జూమ్ మీటింగ్‌ల‌తో ఊద‌ర‌గొట్టే బాబు గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌పై ఒక్క ముక్క కూడా మాట్లాడ‌డం లేదు.ఇక ఈ ఎన్నికల త‌ర్వాత తెలంగాణ‌లో పార్టీని ఉంచుతారో ?  మూసుకుంటారో ?  చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube