నరసాపురం ఎంపీగా ఎన్నారై.. కి అవకాశం..!!  

  • ఏపీ నుంచీ విదేశాలు వెళ్ళిన ఎంతో మంది ఎన్నారైలు ఆర్ధికంగా స్థిరపడ్డారు. అంతేకాదు తమ సొంత ఊళ్ళకి సామాజిక సేవలు చేస్తూ ఉన్నతమైన విలువలతో పేదలకి సాయం చేస్తున్నవారు ఎంతో మంది ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో కొంతమంది ఎన్నారైలు వివిధ పార్టీలలో టిక్కెట్ల కోసం వేచి చూస్తున్నారు. అయితేఊహించని విధంగా ఓ ఎన్నారైని ఎంపీ సీటు వెతుక్కుంటూ వెళ్ళింది. నరసాపురం లోక్ సభ నియోజకవర్గానికి అన్యూహ్యంగా ప్రవాస భారతీయురాలు రావి దీపిక పేరు తెరపైకి వచ్చింది. దంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ఆమె కి రమ్మని ఆహ్వానం పలకడం సంచలనం సృష్టిస్తోంది.

  • కాపు సామాజికవర్గ సమీకరణాలలో భాగంగానే ఆమె పేరుని పరిసీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే స్థానం నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడిని ముందు పోటీకి దింపాలని అనుకున్నా ఆయన అసెంబ్లీ కి మాత్రమే పోటీ చేస్తానని చెప్పడంతో. బాబు దీపిక ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది

  • నర్సాపురం పట్టణాని కి ఆమె ఎంతో కాలంగా సౌదీలోనే ఉంటున్నారు. ఆమె భర్త రాధాకృష్ణ అరంకో సంస్థలో కాంట్రాక్టర్, ముందు నుంచీ టీడీపీ కి అభిమానులు అయిన ఈ కుటుంభం చంద్రబాబు నుంచీ పులుపు రావడంతో సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచీ దెందులూరు బరిలో ఉన్న అబ్బాయి చౌదరి కూడా ఎన్నారై కావడం విశేషం. మరి జనసేన పార్టీ ఎన్నారై లకి అవకాశం ఇస్తుందో లేదో వేచి చూడాలి.