ఏబీ కోసం బాబు ఎందుకు అంత పేచీ! వైసీపీ ఊహించినట్లే కుట్ర ఉందా

ఏపీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని ఎన్నికల సంఘం ఊహించని విధంగా ఎలక్షన్ విధులలో పాల్గొనే అవకాశం లేకుండా బదిలీ వేటు వేసింది.వైసీపీ అతని మీద ఫిర్యాదు చేయడంతో చంద్రబాబు సర్కార్ హుటాహుటిన ఓ జీవో ఏర్పాటు చేసి ఏపీలో డీజీపీ, ఇంటలిజెన్స్ ని ఎన్నికల సంఘం పరిధిలోకి రాకుండా చేసింది.

 Tdp Fight On Ab Venkateswararao With Election Commission-TeluguStop.com

ఎన్నికల సంఘం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ అధికారులపై వేటు వేస్తుందని చంద్రబాబు ఆరోపణ.

అందుకే తమ అధికారులని కాపాడుకోవడానికి ఈ ఎన్నికల సంఘంతో విభేదించి జీవో జారీ చేసినట్లు చెబుతున్నారు.

అయితే ఎన్నికల ముందు ఇలా జీవో జారీ చేసి తనకి అనుకూలంగా ఉండే బీజేపీ, ఇంటలిజెన్స్ అధికారి ఏబీపై బదిలీ వేటు పడకుండా అడ్డుపడిన టీడీపీ సర్కార్ పై వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతుంది.

మరో వైపు ఈ విషయంలో ఎన్నికల సంఘంతో పోరాడేందుకు ఎంత దూరం అయిన వెళ్తాం అంటూ బాబు ప్రభుత్వం హై కోర్ట్ లో పిటీషన్ వేసింది.అయితే ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ విషయంలో టీడీపీ ప్రభుత్వం ఇంతగా పోరాడటానికి కారణం అతను వారికి సహకరించడమే అనే ఆరోపణలు వస్తున్నాయి.చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారని వైసీపీ ఆరోపణ.

ఈ నేపధ్యంలో ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య ఎలక్షన్ కమిషన్ చేసిన అధికారుల బదిలీ పెద్ద రాజకీయ తలనొప్పిగా మారింది అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube