టీడీపీకి రెబల్స్ పోటు తప్పేలా లేదు! చర్యలు తీసుకున్న ఫలితం బెడిసి కొడుతుందా

ఎన్నికల ఏ పార్టీకి అయిన ప్రధానంగా రెబల్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది.ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు నియోజకవర్గాలలో సమీకరణాల ఆధారంగా టికెట్స్ ఇస్తూ ఉంటాయి.

 Tdp Facing Rebels Problem In Elections-TeluguStop.com

అయితే మొదటి నుంచి ఆ ప్రాంతంలో టికెట్స్ ఆశించి భంగపడ్డ ఆశావాహులు ఆ టైంలో రెబల్స్ గా మారి సొంత పార్టీకి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తారు.ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీకి అధినాయకత్వం చరిష్మా కంటే, స్థానికంగా ఉండే నేతల బలం కూడా కొంత వరకు కలిసి వస్తుంది.

స్థానికంగా ప్రజలలో మంచి పట్టు ఉన్న నేతలు పార్టీతో సంబంధం లేకుండా గెలుపుని సొంతం చేసుకుంటారు.గతంలో ఇలాంటి సందర్భాలు చాలా సార్లు జరిగాయి.

ఇప్పుడు కూడా అలాంటి ఫలితాలతో టీడీపీ గెలుపుకి గండి కొట్టే ప్రయత్నం కొంత మంది నేతలు చేస్తున్నారు.స్థానికంగా టికెట్ ఆశించి, చివరి నిమషం వరకు టికెట్ వస్తుందని అనుకున్న నేతలు, పార్టీలో సమీకరణాల వలన టికెట్ కోల్పోవాల్సి వస్తుంది.

ఒక్కోసారి అంత వరకు తిట్టిన అభ్యర్ధికే పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తే వారితో కలిసి పని చేయడానికి నియోజకవర్గ నేతలు సిద్ధంగా ఉండలేరు.దీంతో ఎలా అయిన వారిని ఓడించాలనే లక్ష్యంతో రెబల్స్ గా ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారు.

ఈ సారి టీడీపీ పార్టీ తరుపున అధిక సంఖ్యలోనే రెబల్స్ గా నామినేషన్ వేసిన చంద్రబాబు వారితో నేరుగా మాట్లాడి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేసారు.అయితే ఇప్పుడు ఓ తొమ్మిది మంది తెలుగు దేశం రెబల్స్ చంద్రబాబు మాట కూడా వినడానికి సిద్ధంగా లేకపోవడం, వారు ఎన్నికల బరిలో నిలబడటం ఇప్పుడు ఆ పార్టీ ఫలితంపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.ఈ కారణంగా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసారు.అయిన కూడా టీడీపీ వారి వలన దెబ్బ తినే అవకాశం ఉందని ఆందోళన చెందుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube