చింతమనేనికి వచ్చిన ముప్పేంటి ? రఘురామ రూట్లోనే ? 

గత కొద్ది రోజులుగా టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం ఆయనపై అనేక కేసులు నమోదు చేస్తుండడం, ఆయన అరెస్టు కావడం, బెయిల్ పై బయటకు రావడం,  ఇవన్నీ వరుసగా చోటుచేసుకుంటున్నాయి.

 Tdp Ex Mla Chintamaneni Prabhakar Said He Was Worried About The Security Of The-TeluguStop.com

టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వ్యవహరించిన తీరు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించాయి.వివాదాస్పద నాయకుడిగా ఆయన ముద్ర వేయించుకోవడంతో మంత్రి పదవి ఇద్దాము అనే ఉద్దేశం ఉన్నా, ఆయన వ్యవహార శైలి తో ఆందోళన చెంది చంద్రబాబు ఆ సాహసం చేయలేకపోయింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు చింతమనేని మరో ప్రతిపాదనను కేంద్రం ముందుకు తీసుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.వైసిపి ప్రభుత్వంలో తనకు రక్షణ లేదని, తనకు సీఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని కేంద్రాన్ని కోరేందుకు చింతమనేని ప్రభాకర్ సిద్ధమవుతున్నారు.
        పోలీసులు వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుంటున్నారని , పోలీసులతో తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్నారు.అందుకే తనకు రక్షణ కల్పించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నారు.తాను టిడిపి సీనియర్ నేత , మాజీ ఎమ్మెల్యే కాబట్టి పోలీసుల నుంచి ప్రాణహాని ఉండడంతో కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఆయన కేంద్ర హోంశాఖ కు లేఖ రాయబోతున్నారు.ఇప్పటికే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని కోరుతూ కేంద్రానికి లేఖ రాయడంతో పాటు,  కేంద్ర మంత్రులకు పదేపదే విజ్ఞప్తి చేయడంతో, ఆయనకు ప్రత్యేకంగా సిఆర్పిఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తున్నారు.
 

Telugu Ap Cm Jagan, Chandrababu, Crpf Security, Denduluru Mla, Jagan, Mpraghuram

     ఇప్పటికే ఆయన వై కేటగిరీలో భద్రతను పొందుతున్నారు.ఇప్పుడు తనకు అదేవిధంగా రక్షణ కల్పించాలన్న విధంగా చింతమనేని డిమాండ్ చేస్తున్నారు.అయితే రఘురామకృష్ణంరాజు మాదిరిగా చింతమనేని పోల్చుకోవడం , ఆయనకు కల్పిస్తున్నట్లుగానే  తనకు భద్రత కల్పించలని కోరుకోవడం అత్యశ గాని కనిపిస్తుంది.ఎందుకంటే రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు.

అది కాకుండా కేంద్ర బిజెపి పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో కేంద్రం ఆయన అడిగిన వెంటనే భద్రత కల్పించింది.

కానీ చింతమనేనికి మాజీ ఎమ్మెల్యే అనే హోదా తప్పించి ఏ పదవి లేకపోవడంతో ఆయనకు కేంద్రం భద్రత కల్పించడం అనుమానమే.అది కాకుండా టిడిపి విషయంలో కేంద్ర బిజెపి పెద్దలు ఆగ్రహం ఉండడం ఇవన్నీ చింతమనేనికి ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube