మీరు మగాళ్లయితే..! వైసీపీకి టీడీపీ సవాల్ 

Tdp Ex Mla Bonda Uma Sensational Comments On Ysrcp Mlas

వైసిపి టిడిపి ల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది .నిన్న వైసీపీ శ్రేణులు టిడిపి కార్యాలయంపై దాడి చేసిన ఘటనకు నిరసనగా టిడిపి అధినేత చంద్రబాబు 36 గంటల మౌన దీక్షకు దిగారు.

 Tdp Ex Mla Bonda Uma Sensational Comments On Ysrcp Mlas-TeluguStop.com

దీనికి కౌంటర్ గా వైసీపీ శ్రేణులు జనాగ్రహ దీక్ష చేపట్టారు.ఇలా ఒక పార్టీకి మరో పార్టీ నాయకులు కౌంటర్ ఇస్తూ,  ఏపీ రాజకీయాన్ని వేడెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు.

తాజాగా వైసీపీ నేతలకు టిడిపి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు సవాల్ విసిరారు.దీంతో పాటు అనేక విమర్శలు చేశారు.వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని విమర్శించారు.
  13 జిల్లాల్లోని వైసీపీ ఎమ్మెల్యేలు మాదకద్రవ్యాలను ఆదాయ వనరు గా మార్చుకున్నారు అంటూ విమర్శించారు.జే బ్రాండ్లు కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.దేశం మొత్తానికి ఆంధ్రాను డ్రగ్స్ కు కేంద్రంగా మార్చారు అని,  స్థానిక ఎన్నికల సమయంలోనూ తమను చంపేందుకు చూశారని,  తమపై దాడి చేసిన వ్యక్తికి మాచర్ల చైర్మన్ పదవి కట్టబెట్టారని బోండా ఉమ విమర్శించారు.

 Tdp Ex Mla Bonda Uma Sensational Comments On Ysrcp Mlas-మీరు మగాళ్లయితే.. వైసీపీకి టీడీపీ సవాల్ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

  తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు చేస్తే వైసీపీ ప్రభుత్వం పదవులు ఇస్తోందని,  ఏపీ లో దాదాపు 25 వేల ఎకరాల్లో వైసిపి నాయకులు గంజాయి సాగుకు మద్దతు ఇస్తున్నారని,  డబ్బుకోసం వైసిపి నాయకులు యువత భవిష్యత్తును పణంగా పెడుతున్నారని విమర్శించారు.
 

Telugu Ap Cm Jagan, Ap, Bonda Uma, Chandrababu, Jagan, Pattabhi, Ysrcp-Telugu Political News

రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు పోరాటం చేస్తుంటే , తమపై దాడి చేస్తున్నారని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.దళిత నేత మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు కు నోటీసు ఇస్తారా ఇదేం బోసిడికే పాలన అని రాష్ట్రంలో పేద ప్రజలు అంటున్నారని విమర్శించారు.  ” ఎవరూ లేనప్పుడు పోలీసులు అండ తో దాడి చేయడం కాదు… మీరు మొగాళ్లు అయితే చంద్రబాబు దీక్ష ముగిసేలోపు రండి అంటూ బోండా ఉమా సవాల్ విసిరారు.

#Pattabhi #Ysrcp #AP #ChandraBabu #AP CM Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube