లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్! టిడిపికి షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్!  

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని అడ్డుకోలేమని తేల్చేసిన ఎలక్షన్ కమిషన్..

Tdp Complaint To Stop Laxmi\'s Ntr Movie-bjp,chandrababu,janasena,laxmis Ntr Movie,rgv,tdp Complaint,ysr Congress

ఎన్టీఆర్ జీవితంలో ముఖ్య ఘట్టాలను తీసుకొని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాని తెరకెక్కిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాని మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ఆర్జీవి రంగం సిద్ధం చేసుకున్నాడు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో టీడీపీ అధినేత చంద్రబాబును విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తూ ఈ సినిమా ఆపాలని టిడిపి పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. .

లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్! టిడిపికి షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్!-TDP Complaint To Stop Laxmi's NTR Movie

అయితే తాజాగా ఈ సినిమాపై ఏపీ ఎన్నికల సంఘం టిడిపి పార్టీ నేతలకు షాక్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల నిలిపే అధికారం తమకు లేదని కాకుంటే ఈ సినిమా మా లో ఏదైనా ఒక పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉందని అనిపిస్తే కేసు నమోదు చేస్తామని మాత్రం స్పష్టం చేశారు. అయితే టిడిపి మీ పార్టీ ఫిర్యాదుపై ఆర్జివి కూడా స్పందించి తాను సినిమాని ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలీజ్ చేసి తీరుతానని, ఒకవేళ థియేటర్లో కాకుంటే నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తానని స్పష్టం చేశాడు.