టీడీపీలో ఎన్ని మార్పులో ? ఈ సారి గురి తప్పదట ? 

ఏదో రకంగా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగానే కృషి చేస్తున్నారు.ఇప్పుడు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించిన ఆయన, కొత్త కమిటీలను నియమించి,  పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు.

 Tdp Chief Chandrababu Take Desistion Of Party Comitee Changes Chandrababu, Tdp,-TeluguStop.com

ఈ కమిటీల నియామకం తర్వాత, పార్టీలో మంచి ఊపు వచ్చినట్లుగానే కనిపించింది.అదే ఊపుతో పార్టీలో మరింత ఉత్సాహం తీసుకువచ్చేందుకు రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు నియమించాలని , అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీపరంగా తీసుకోవలసిన అన్ని చర్యలను తీసుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు.

అలాగే నియోజకవర్గాల వారీగా ఇంచార్జి లను నియమించి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా బాబు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా పార్టీ లోని లోటు పాట్లను, తప్పిదాలను అన్నిటినీ నాయకుల నుంచి అడిగి తెలుసుకుంటున్న ఆయన, నాయకులంతా సమన్వయంతో విధంగా ముందుకు వెళ్లి, పార్టీకి ఏ ఇబ్బంది లేకుండా, చూడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే పార్టీ తరపున ఎవరెవరు యాక్టివ్ గా ఉన్నారు ? ఎక్కడ ఎటువంటి లోపాలు ఉన్నాయి అనే విషయాలన్నిటినీ బాబు తెలుసుకుంటున్నారు.త్వరలోనే అన్ని విషయాల పైన ఒక క్లారిటీ కి వచ్చి, పార్టీ కమిటీలను నియమించాలి అనేది బాబు ఆలోచన.ఏదో రకంగా పార్టీపై జనాల్లో ఆదరణ పెరిగే విధంగా చేయాలంటే, ముందుగా పార్టీ నాయకుల్లో ఉత్సాహం కలిగించాలనేది బాబు అభిప్రాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే రాష్ట్ర కమిటీ నియమానికి సంబంధించిన ప్రక్రియ పూర్తయినా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం విషయంలో సందిగ్ధత నెలకొంది.రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్ననాయుడు ను నియమించాలి అనేది బాబు ప్లాన్ గా కనిపిస్తుండగా, ఆయన నియామకం పై లోకేష్ అభ్యంతరాలు చెబుతున్నారని అందుకే ఆ కమిటీ నియామకం ఆలస్యం అవుతోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube