జగన్ నువ్వేం పీకుతున్నావ్ ?

ఏపీ సీఎం జగన్ పై సంచలన విమర్శలు చేస్తూ టిడిపి అధినేత చంద్రబాబు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.ఇప్పటి వరకు జగన్ పై ఉన్న మొత్తం ఆగ్రహాన్ని ఈరోజు చూపించినట్లుగా వ్యవహరించారు.

 Tdp Chief Chandrababu Sensational Comments On Jagan, Chandra Babu Naidu, Ys Jaga-TeluguStop.com

నేడు అమరావతిలో రాజధాని జన భేరి సభ లో పాల్గొన్న బాబు జగన్ ఉద్దేశించి సంచలన విమర్శలు చేశారు.నేను సభకు వెళ్తుంటే ఉద్దండరాయునిపాలెం వద్ద అడ్డుకున్నారని, నాకు అక్కడికి వెళ్లే హక్కు లేదా అంటూ బాబు మండిపడ్డారు.

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని జగన్ పదేపదే తమపై ఆరోపణలు చేస్తున్నారని,  అదే నిజమైతే 18 నెలలు అధికారంలో ఉన్న నువ్వు నిరూపించకుండా ఏం పీకుతున్నావ్ అంటూ జగన్ ను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మండిపడ్డారు.

ఈ సందర్భంగా జగన్ పై ఎన్నో ఆరోపణలు చేశారు.

ప్రజలంతా మూడు రాజధానులకు మద్దతు తెలిపితే, తాను రాజకీయాల నుండి వైదొలుగుతానని ప్రకటించారు. హైదరాబాద్ ,విశాఖపట్నం లో కులం ఉందని అభివృద్ధి చేయలేదు.

పులివెందులకు నీళ్లు ఇచ్చామన్నారు.దుశ్శాసనుడు,  ద్రౌపతి చీరను పట్టుకున్న కారణంగా ఆ రాజ్యం నాశనమైందని,  ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురు కాబోతోంది అంటూ బాబు జోస్యం చెప్పారు.

Telugu Amaravathi, Chandrababu, Jagan, Sensational, Ysrcp-Telugu Political News

హైదరాబాద్ లో నీళ్లు లేకపోతే కృష్ణా నది నుండి నీరు ఇచ్చమ ని గుర్తు చేశారు.ఇక్కడ పుష్కలంగా నీళ్ళు ఉన్నాయని బాబు అన్నారు.జగన్ వన్ టైం ముఖ్యమంత్రి అంటూ బిజెపి వాళ్ళు ఎప్పుడో చెప్పారు అని బాబు చెప్పుకొచ్చారు.130  పైగా సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాయని గుర్తు చేశారు.అమరావతిలో రాజధాని నిర్మించేందుకు ఫౌండేషన్ కు చాలా ఖర్చు అవుతుంది అని జగన్ పదేపదే చెబుతున్నారు అని, హైదరాబాద్ లోటస్ పాండ్ , బెంగళూరు లో భవనాల ఫౌండేషన్ కంటే తక్కువ ఖర్చు  ఇక్కడ ఫౌండేషన్ కు ఖర్చు అవుతుంది అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు.ప్రస్తుతం  జగన్ పై బాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube