సరికొత్త తొక్కుడు : జిల్లా బాట పట్టబోతున్న చంద్రన్న ?  

tdp chief chandrababu plan districts tour, TDP, Chandrababu,Amaravati, AP Capital, YCP, Amaravati Farmers, YS jagan - Telugu Amaravati, Amaravati Farmers, Ap Capital, Chandrababu, Tdp, Tdp Chief Chandrababu Plan Districts Tour, Ycp, Ys Jagan

అమరావతి నా శ్వాస, నా ధ్యాస అంటూ నిత్యం అమరావతి నామస్మరణలోనే ఉంటారు టీడీపీ అధినేత చంద్రబాబు.టిడిపి అధికారంలో ఉన్న సమయంలో అమరావతిని బాగా ప్రమోట్ చేశారు.అక్కడే రాజధాని అంటూ హడావుడి చేశారు.అమరావతి ఏపీ రాజధాని అని అంతా ఫిక్స్ అయిపోయిన తరువాత, ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసిపి మూడు రాజధానులు అంటూ కొత్త మెలిక పెట్టింది.

TeluguStop.com - Tdp Chief Chandrababu Plan Districts Tour

దీంతో అమరావతి అంశం పక్కన పడిపోయింది.కానీ టిడిపి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ రాజధాని నిర్మాణం జరగాలని, వేరే ప్రాంతానికి రాజధాని తరలిస్తాము అంటే కుదరదు అని హెచ్చరికలు చేయడంతోపాటు, అమరావతి పరిసర ప్రాంతాల ప్రజలను రెచ్చగొడుతూ, కొద్దిరోజులు హడావిడి చేస్తోంది.

ఈ విషయంలో జగన్ ఎవరిని లెక్క చేసే విధంగా లేరు.దీంతో పాటు కేంద్రం కూడా జగన్ కి రాజధాని విషయంలో మద్దతు ప్రకటిస్తూ ఉండడంతో, అమరావతి ఇక ముగిసిన అధ్యయనం అనే అభిప్రాయానికి దాదాపుగా అందరూ వచ్చేశారు.
చంద్రబాబు మాత్రం సరికొత్త ఎత్తుగడ వేశారు.పార్టీ నాయకుల్లో ఉత్సాహం తీసుకువచ్చేందుకు, అమరావతి వ్యవహారాన్ని టిడిపి పక్కన పెట్టేదే లేదు అనే విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు చంద్రబాబు సరికొత్త ఎత్తు వేసినట్లుగా తెలుస్తోంది.

TeluguStop.com - సరికొత్త తొక్కుడు : జిల్లా బాట పట్టబోతున్న చంద్రన్న -Political-Telugu Tollywood Photo Image

జిల్లాల వారీగా పర్యటనలు చేపట్టి అమరావతి వ్యవహారాన్ని హైలెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.అమరావతి వ్యవహారంతో పాటు, అనేక ప్రజా సమస్యల విషయంలోనూ ఈ విధంగానే వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేసి ఆ పార్టీ దూకుడు తగ్గించాలనే విధంగా చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ జిల్లా యాత్రల్లో అమరావతి వ్యవహారంతో పాటు, ఆయా జిల్లాలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వైసీపీ నాయకుల వ్యవహారం ఇలా అన్నింటి పైన బాబు ప్రసంగాల చేసి, పార్టీ నాయకుల్లో ఉత్సాహం కలిగించడంతో పాటు, ప్రజల్లోనూ టిడిపిపై సానుభూతి కలిగించే విధంగా చేసేందుకు చంద్రబాబు అన్ని రకాలుగానూ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.చంద్రబాబు వెంట ఆయన కుమారుడు లోకేష్ ను సైతం తీసుకువెళ్లి ఆయనతోనూ ప్రసంగాలు చేయించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

#Amaravati #AP Capital #TdpChief #Chandrababu #YS Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tdp Chief Chandrababu Plan Districts Tour Related Telugu News,Photos/Pics,Images..