బాబు చూపు బీజేపీ వైపు ? వర్కవుట్ అవుతుందా ?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు ఇకపై కష్టాలకు ఎదురీదక తప్పని పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తోంది.బాబు ముందు నుంచి ఏదైతే జరగకూడదని భయపడుతున్నాడో సరిగ్గా అదే జరగడం ఆయనలో ఆందోళన కలిగిస్తోంది.

 Tdp Chief Chandrababu Naidu Try To Friendship With Bjp Party-TeluguStop.com

కేంద్రంలో మోదీ, ఏపీలో జగన్ , పక్క రాష్ట్రమైన తెలంగాణాలో కేసీఆర్ ఇలా ముగ్గురు రాజకీయ శత్రువులు ఒక్కటై తన మీద కక్ష తీర్చుకుంటారేమో అని ఆందోళనలో ఉన్నాడు.కేంద్రంలో చక్రం తిప్పుదామని చూసిన ఆయన ఇప్పుడు ఓటమిపాలవ్వడంతో అమరావతికే పరిమితం అయ్యారు.

కాంగ్రెస్ తో కలిసి హంగ్ వస్తే చక్రం తిప్పుదామని భావించగా ఫలితం తారుమారయ్యింది.ఈ నేపథ్యంలో మళ్ళీ బీజేపీతో కలిస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచన బాబులో ఇప్పుడు కనిపిస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.

బీజేపీతో పొత్తు తెంచుకుని అనవసర కష్టాలు ఎదురుకుంటున్నామని, అదే ఎన్డీయేతో ఉండి ఉంటే ఈ కష్టాలు తప్పేవని బాబు బాధపడుతున్నాడట.అందుకే ఇప్పుడు మరోసారి ఆ కూటమిలోకి వెళ్లడానికి రాయబారం నడిపించబోతున్నారనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది.

ఈ వ్యవహారాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ద్వారా డీల్ చేయించి బీజేపీకి దగ్గరవ్వాలని బాబు చూస్తున్నాడు.ఈ మేరకు విజయవాడ ఎంపీ కేశినేని నానిని రాయబారానికి పంపించారట.

ఈ మేరకు కేశినేని నాని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో భేటి కావడం, సుమారు అరగంటకు పైగా వారిద్దరి మధ్య చర్చలు సాగడం ఆ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.

-Telugu Political News

గత ఎన్నికల ముందు బీజేపీ టీడీపీ మధ్య స్నేహబంధం ఏర్పడడానికి కారణం ఒకరకంగా వెంకయ్య నాయుడే కారణం.వెంకయ్య కేంద్రంలో మంత్రిగా ఉన్నంత కాలం టీడీపీకి గానీ చంద్రబాబుకు గానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు.కానీ ఉపరాష్ట్రపతిగా వెళ్లాకే టీడీపీ – బీజేపీ స్నేహబంధం చెడింది.

టీడీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో శత్రుత్వం కొనసాగించేకంటే ఏదో ఒకరకంగా దగ్గరయ్యి స్నేహబంధం ఏర్పరుచుకుంటే కేసీఆర్, జగన్ ల నుంచి కూడా రక్షణ పొందవచ్చని బాబు భావిస్తున్నాడట.అయితే బీజేపీ చంద్రబాబు విషయంలో సానుకూలంగా ఉండే అవకాశం అయితే కనిపించడంలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube