అందరూ అనుమానాస్పదమే ? బాబు గారి బాధ ఇంతింత కాదు   

tdp chief chandrababu chief chandrababu tention on party mlas try to join in ysrcp tdp ,chandrababu ,lokesh , jagan, ysrcp ,ganta srinivasarao, vizag, mla ,vasupalli ganesh, ganababu, velagapudi ramakrishnababu - Telugu Chandrababu, Ganababu, Ganta Srinivasarao, Jagan, Lokesh, Tdp, Vasupalli Ganesh, Velagapudi Ramakrishnababu, Vizag, Ysrcp

పార్టీ లో ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు తెలియని పరిస్థితి నెలకొంది ఇప్పటికే పెద్ద ఎత్తున నాయకులంతా వెళ్లిపోవడం, ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు వైసిపి బాట పడుతుండడంతో తెలుగుదేశం పార్టీలో ఆందోళన అంతా ఇంత కాదు.పార్టీ నుంచి వలసలు నివారించడానికి ఎప్పటికప్పుడు ఎన్ని రకాల ఎత్తుగడలు వేస్తూ, పార్టీ నాయకుల్లో ఉత్సాహం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా, భవిష్యత్తుపై బెంగతో నాయకులు అధికార పార్టీ వైపు వెళ్ళిపోతూ ఉండడంతో చంద్రబాబును మరింతగా కుంగదీస్తోంది.

TeluguStop.com - Tdp Chief Chandrababu Chief Chandrababu Tention On Party Mlas Try To Join In Ysrcp

వైసీపీలో చేరికలను ఆచితూచి ప్రోత్సహిస్తూ ఉండడంతో, నాయకుల వలస నెమ్మదిగా ఉందని, అదే పూర్తిగా గేట్లు తెరిస్తే తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుందని బాబు అంచనా వేస్తున్నారు.అందుకే పార్టీ నాయకుల్లో ఉత్సాహం తీసుకువచ్చేందుకు కొత్త కమిటీల నియామకం చేపట్టి, ఇక నిత్యం టిడిపి జనాల్లో ఉండేలా చేయాలని, పార్టీలో కొత్త ఉత్సాహం తీసుకువచ్చే విధంగా ప్రయత్నించాలి అనే విధంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.

అయినా చాలా మంది నాయకులు పార్టీపై నమ్మకం పెంచుకోలేకపోతున్నారు.

TeluguStop.com - అందరూ అనుమానాస్పదమే బాబు గారి బాధ ఇంతింత కాదు -Political-Telugu Tollywood Photo Image

ఇప్పటికే టిడిపి నుంచి వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ వంటి ఎమ్మెల్యేలు దూరమయ్యారు.

ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలు వైసీపీ వైపు చూస్తుండడంతో, వారిని ఎలా కట్టడి చేయాలనే విషయంపై బాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండగా, ఇప్పటికే వాసుపల్లి గణేష్ వైసీపీకి జై కొట్టడంతో గంటా శ్రీనివాసరావు ,గణబాబు, వెలగపూడి రామకృష్ణ బాబు ఏ నిర్ణయం తీసుకుంటారనే టెన్షన్ బాబులో ఉంది.

వెలగపూడి రామకృష్ణబాబు పార్టీ మారే ఆలోచన చేయడం లేదని ఖచ్చితమైన సమాచారం చంద్రబాబు వద్ద ఉంది.

కానీ గంటా శ్రీనివాసరావులు, గణబాబు మాత్రం ఇద్దరూ అనుమానాస్పదంగానే ఉండడంతో, వీరు రేపోమాపో పార్టీని వీడుతారనే ఆందోళన ఉంది.

అదే జరిగితే మరికొన్ని జిల్లాల్లో టిడిపి నాయకులు వారి బాట పట్టే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.ఇప్పుడు కొత్త కమిటీల నియామకంతో పార్టీకి ఊపు తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షులు మిగతా కార్యవర్గ సభ్యులను నియమించి పార్టీని గాడిలో పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ సమయంలో వలసలు బాబును తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి.

#Jagan #Ysrcp #Ganababu #Lokesh #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tdp Chief Chandrababu Chief Chandrababu Tention On Party Mlas Try To Join In Ysrcp Related Telugu News,Photos/Pics,Images..