పరామర్శలతో పడగొడుతున్న బాబు ?  

chandra babu try to aliance on bjp , BJP, Chandrababu naidu, Amit Shah, Goyal, Modi, Health Updates - Telugu Amit Shah, Bjp, Chandra Babu Try To Aliance On Bjp, Chandrababu Naidu, Goyal, Health Updates, Modi

రాజకీయ ఎత్తులు పైఎత్తులు వేయడంలో టిడిపి అధినేత చంద్రబాబును మించిన వారు మరొకరు కనిపించరు.రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో, తన పై ఎత్తులతో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ సక్సెస్ అవుతూ ఉంటారు.

TeluguStop.com - Tdp Chief Chandra Babu Try To Aliance Bjp

ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి ఎన్నో వ్యవహారాలను చక్కబెట్టారు.ఇదిలా ఉంటే, గతంతో పోలిస్తే చంద్రబాబు వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.ఏదో రకంగా తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహం తీసుకువచ్చేందుకు, ఆ పార్టీని అధికారం వైపు నడిపించేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు.2019 ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గర నుంచి చంద్రబాబు బిజెపికి దగ్గరయ్యేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు.టిడిపిలో అత్యంత కీలకమైన నాయకులను సైతం బీజేపీ లోకి బాబు పంపించి ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు.

కానీ బిజెపి పెద్దల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు.

TeluguStop.com - పరామర్శలతో పడగొడుతున్న బాబు -Political-Telugu Tollywood Photo Image

పైగా ఏపీలో, బిజెపి తమను టార్గెట్ చేసుకుంటూ ఉండడం బాబుకు కొంతకాలంగా ఆగ్రహం కలిగిస్తోంది.పైగా బిజెపిపై విమర్శలు చేయకుండా, ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు అన్ని మార్గాలను వెతుక్కుంటున్నారు.

గత కొద్ది రోజులుగా చూస్తే అదేపనిగా బిజెపి కేంద్ర పెద్దలతో సన్నిహితంగా మెలిగేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నారు.సందర్భం ఉన్నా, లేకపోయినా బీజేపీ అగ్ర నేతలను పరామర్శిస్తూ, ఫోన్ లో కుశల ప్రశ్నలు వేస్తూ, బాబు గత కొంతకాలంగా హడావుడి చేస్తూ, ఏదో రకంగా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ ప్రభావానికి గురైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఫోన్ చేసి మరీ బాబు పలకరించారు.ఆ తరువాత సందర్భం వచ్చిన ప్రతిసారి, బిజెపి పెద్దలందరినీ పరామర్శిస్తూ వస్తున్నారు.

ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని, ఆయనకు శుభాకాంక్షలు ఫోన్ చేసి మరీ చెప్పారు.అలాగే కిడ్నీలో రాళ్ల కారణంగా ఆపరేషన్ చేయించుకున్న కేంద్ర మంత్రి గోయల్  ను పరామర్శించారు.

ఇక సోషల్ మీడియా ద్వారా ను బాబు అదేపనిగా బీజేపీపై పొగడ్తల వర్షం కురిపిస్తూ వస్తున్నారు.బీజేపీ నేతలు ఏపీలో టీడీపీ విమర్శిస్తున్నా, ఏ మాత్రం వారిని పల్లెత్తుమాట అనకుండా, వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే, ఫలితాలు మళ్లీ 2019 మాదిరిగానే వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన ఆయన, ఈ రకంగా అయినా ఆ పార్టీకి దగ్గర అయ్యేందుకు పొత్తు పెట్టుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.మరి కేంద్ర బిజెపి పెద్దలు బాబు తాపత్రయం అర్థం చేసుకుని పొత్తు పెట్టుకుంటారో లేక యధావిధంగా దూరం పెడతారో చూడాలి.

#Health Updates #ChandraBabu #Amit Shah #Goyal #Modi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tdp Chief Chandra Babu Try To Aliance Bjp Related Telugu News,Photos/Pics,Images..