గోడలు దూకే పోలీసులు ! స్టేషన్ కి వెళ్తా అంటూ బాబు ఫైర్ 

గత కొద్ది రోజులుగా ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామలై టిడిపి అదినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు.ముఖ్యంగా టిడిపి నాయకులను,  కార్యకర్తలను టార్గెట్ చేసుకుంటూ వైసీపీ నాయకుల ఆదేశాలతో పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బాబు గత కొంతకాలంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు.

 Tdp Chief Chandrababu Angry On Ap Cid Police Details, Tdp, Ysrcp, Ap, Ap Social-TeluguStop.com

తాజాగా మరోసారి ఈ అంశంపై చంద్రబాబు స్పందించారు.సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారనే కారణాలతో టిడిపి సానుభూతిపరులని కార్యకర్తలని సిఐడి పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉండడం పై చంద్రబాబు మండిపడ్డారు.సుప్రీంకోర్టు ఆదేశాలు విస్మరించి మరీ పోలీసులు అరెస్టులు చేస్తున్నారని,  గుంటూరులో ఇద్దరు టిడిపి కార్యకర్తలను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారనే కారణంతో పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని బాబు తప్పు పట్టారు.
  41 ఎ నోటీసు ఇవ్వాలంటే అర్ధరాత్రి వెళ్లాలా అంటూ సిఐడి పోలీసులపై మండిపడ్డారు.సిఐడి వికృతి చేష్టలు పరాకాష్టకు చేరాయని,  సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో దాదాపు 600 మంది పై కేసు నమోదు చేశారని చంద్రబాబు మండిపడ్డారు.తప్పుడు కేసులు పెడుతూ టిడిపి నేతలను ఇబ్బందులు పెడుతున్న అధికారులను చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు.

అవసరమైతే తానే స్టేషన్ కు వెళ్తానని చెప్పారు.
 

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Lokesh, Sambasivarao, Tdp, Tdp Volanteers, Venkat

తన రాజకీయ జీవితంలో ఇలాంటి చెత్త పరిపాలన చూడలేదని విమర్శించారు.పోలీసులు సైకోలుగా తయారవుతున్నారా సాంబశివరావు వెంకటేష్ ఇళ్లకు వెళ్లి బెదిరిస్తారా అంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంటి గోడలు దూకి వెళ్లి నోటీసులు ఇవ్వాలా అంటూ  పోలీసులు తీరుపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 గతంలోనూ అనేకసార్లు ఈ తరహా అరెస్ట్ లు చోటుచేసుకోగా, అప్పట్లో చంద్రబాబు తో పాటు , లోకేష్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.ఇప్పుడూ దీనిపై మరింత రచ్చ చేసేందుకు టీడీపి సిద్ధం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube