తెలంగాణలో టీడీపీ చాప్టర్ క్లోజ్! ఇక ఆశలన్నీ ఏపీపైనే  

Tdp Chapter Closed In Telangana State Politics-tdp Chapter Closed,telangana State Politics,trs,ysrcp

తెలుగు రాష్ట్రాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆ స్థాయిలో సుదీర్ఘ రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ సొంతం.తెలుగు ప్రజల ఆత్మాభిమానం నినాదంతో ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ అప్పటి కాంగ్రెస్ పార్టీకి బలంగా ఎదుర్కొని ఎన్టీఆర్ చరిష్మాతో అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చింది.

TDP Chapter Closed In Telangana State Politics-Tdp Telangana Politics Trs Ysrcp

అదే సమయంలో తెలుగు దేశం పార్టీ పగ్గాలు ఊహించని విధంగా చంద్రబాబు చేతికి వచ్చిన కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏపీలో తన రాజకీయ ప్రస్తానం సృష్టించుకుంది.ఏకంగా 30 ఏళ్ళకి పైగా తెలుగు రాష్ట్రాలలో సుదీర్ఘ రాజీయ ప్రస్తానం కొనసాగించింది.

అయితే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపధ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా టీడీపీ ఉంటుందని భావించారు.

ఊహించని విధంగా 2014 నుంచి 2020 వచ్చేసరికి తెలంగాణలో టీడీపీ ప్రస్తానం ముగిసిపోయింది.

అప్పటి ఎన్నికలలో కొంత వరకు ప్రభావం చూపించిన తర్వాత టీడీపీ తరుపున గెలిచినా ఎమ్మెల్యేలు అందరూ టీఆర్ఎస్ గూటికి వెళ్ళిపోయారు.ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే మళ్ళీ మొదటికి వచ్చేసింది.

తెలంగాణ వదులుకొని కేవలం ఆంధ్రా పార్టీగా మిగిలిపోయిన తెలుగుదేశం పార్టీ 2014లో బీజేపీ, జనసేన దయతో అధికారంలోకి వచ్చింది.అయితే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు ఉపయోగించుకోకపోవడం వలన, వైఫల్యాలు కారణంగా ఐదేళ్లలోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చి ఏపీ ప్రజలు చంద్రబాబుకి కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టి వైసీపీకి పట్టం కట్టారు.

దీంతో ఏపీలో కూడా కేవలం 20 స్థానాలకి టీడీపీ పరిమితం అయిపోయింది.అయితే జగన్ ఇప్పుడు ఏపీలో టీడీపీ పార్టీ అనేది ఉండకూడదు అనే విధంగా రాజకీయ వ్యూహాలతో ఇరికిస్తున్నారు.

ఈ దెబ్బలకి ప్రతిపక్షంలో ఉన్నా కూడా టీడీపీ పార్టీ కోలుకోలేకపోతుంది.తెలంగాణలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలతో టీడీపీ ప్రస్తానం అక్కడ ముగిసిపోయినట్లే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ఏపీలో ముగిసిపోకుండా ఉండాలంటే చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకొని పార్టీ పగ్గాలు లోకేష్ బలమైన వ్యక్తి చేతిలో పెట్టాల్సిందే అనే మాట వినిపిస్తుంది.మరి ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందో చూడాలి.

.

తాజా వార్తలు

Tdp Chapter Closed In Telangana State Politics-tdp Chapter Closed,telangana State Politics,trs,ysrcp Related....