బీజేపీ టీడీపీ కాంగ్రెస్ ! పవన్ ఆప్షన్ ఏంటి ?

పార్టీ పెట్టి చాలా సంవత్సరాలు అయినా, ఇప్పుడే అసలు సిసలైన రాజకీయం అంటే ఏంటో చూపించబోతున్నాను అని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.ప్రస్తుతం వైసిపి, జనసేన మధ్య నెలకొన్న రాజకీయ యుద్ధ వాతావరణం ఇప్పట్లో పోయేలా కనిపించడం లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీ సైతం ఈ వ్యవహారంలో చిక్కుకుపోయింది.ఇక ఏపీ అధికార పార్టీ వైసీపీకి అసలు సిసలైన ప్రతిపక్షం తామే అని పవన్ ప్రకటించేశారు.2024 టార్గెట్ గా జనసేన ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.ఇక కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికలలోనూ జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు.

 Tdp, Chandrababu, Jagan, Bjp,aliance, Movie Tikets Online Issues, 2024 Elections-TeluguStop.com

ఇవన్నీ ఇలా ఉంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసి ఎన్నికల్లో గెలిచినంత  స్థాయిలో బలం పుంజుకోవడంతో ఏ పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటుంది అనేది ఎవరికి అర్దం కావడం లేదు.ప్రస్తుతం బిజెపి ,జనసేన పార్టీల మధ్య పొత్తు కొనసాగుతున్నా, ఆ పొత్తు అంతంత మాత్రమే అన్నట్టుగా రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి.

 ఎవరికి వారే సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారు.ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించటం లేదు.

అదే కాకుండా వైసీపీ ప్రభుత్వం , పవన్  కు మధ్య తీవ్రస్థాయిలో వివాదం చోటు చేసుకున్నా, బీజేపీ నుంచి పెద్దగా ఎవరు రియాక్ట్ కాలేదు.దీంతో బీజేపీ తో జనసేన పొత్తు రద్దు చేసుకునే ఆలోచనలో ఉంది అనే అభిప్రాయం అందరిలోనూ మొదలైంది.

Telugu Aliance, Chandrababu, Jagan, Janasenani, Tikets, Pavan Kalyan, Tollywood-

అలాగే టిడిపితో పొత్తు పెట్టుకునే ఆలోచనలోనూ ఉన్నారని ప్రచారం జరుగుతుండగా , ఇప్పటికే టిడిపి జనసేన రహస్య మిత్రులు అంటూ అటు వైసీపీతో పాటు ప్రజల నుంచి విమర్శలు వస్తున్న క్రమంలో ఆ పార్టీతో కంటే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడమే మంచిదనే అభిప్రాయం లో పవన్ ఉన్నట్లుగానూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉన్న నడిపించే సమర్థవంతమైన నాయకత్వం లేక ఆ పార్టీ పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది.  అయితే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా క్షేత్రస్థాయి నుంచి జనసేన బలోపేతం చేసేందుకు అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయంతో పవన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి.అసలు 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి టిడిపి ,కాంగ్రెస్ ,బిజెపిలో పవన్ ఎవరికి మద్దతు ఇస్తారు ఎవరి మద్దతు తీసుకుంటాం అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube