ఆ మత్తు డాక్టర్ వ్యవహారం టీడీపీకే ముప్పు తెచ్చిందిగా ?  

Tdp Chandrababu Doctor Sudhakar - Telugu Cbi Case, Chandrababu Naidu, Doctor Sudhakar, Mahanadu, Tdp, Tdp On Doctor Sudhakar Issue, Ycp

ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అనుకుంటూ టీడీపీ నేతలు ఇప్పుడు తీరిగ్గా తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.నర్సీపట్నం ప్రభుత్వ ఎనస్థీషియా డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో అతిగా స్పందించామనే అభిప్రాయంతో టిడిపి నేతలంతా ఇప్పుడు తీరిగ్గా బాధపడుతున్నట్లు కనిపిస్తోంది.

 Tdp Chandrababu Doctor Sudhakar

కరోనా వైరస్ కిట్లు, రక్షణ పరికరాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది అన్నట్లుగా సుధాకర్ మీడియా ముఖంగా వ్యాఖ్యానించడం, దీనిపై ప్రభుత్వం సీరియస్ అవ్వడం, ఆ తరువాత రకరకాల కారణాలతో ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం తెలిసిందే.ఇక ఆయన ఆ తరువాత రోడ్డుపై పబ్లిక్ కి ఇబ్బంది కలిగించే విధంగా ఆయన వ్యవహరించారనే కారణంతో పోలీసులు డాక్టర్ సుధాకర్ ను అరెస్టు చేశారు.

ఈ వ్యవహారం కోర్టు వరకు తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళింది.దీనిపై హైకోర్టు సిబిఐ విచారణకు కూడా ఆదేశాలు ఇచ్చింది.

ఆ మత్తు డాక్టర్ వ్యవహారం టీడీపీకే ముప్పు తెచ్చిందిగా -Political-Telugu Tollywood Photo Image

దీనిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టగా, ఈ వ్యవహారంలో సుధాకర్ తప్పు కూడా ఉందని, నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి రావడమే కాకుండా, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వంటి వారిని దూషించడం, వంటి వాటికి ఆయన పాల్పడ్డారు అనే సాక్షాలను సీబీఐ సంపాదించిందట.దీంతో సిబిఐ ఆయనపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.

దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.ఇప్పటి వరకు సుధాకర్ ను వెనకేసుకుంటూ వచ్చిన టిడిపి ఆయన విషయంలో ఇప్పుడు ఏం చేయాలనే దానిపై ఎటూ తేల్చుకోలేక పోతుంది.

సి బిఐ ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేయడంతో, ఆయన బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ పెద్దలను దూషించడం నేరమే అవుతుంది.

దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా సిబిఐ సంపాదించడంతో సుధాకర్ వ్యవహారంలో అతిగా స్పందించామనే అభిప్రాయం ఇప్పుడు టిడిపి నాయకుల్లో మొదలైంది.డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా వైసీపీ ప్రభుత్వంపై ఎదురు దాడి చేద్దామని ప్రయత్నిస్తే ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది అనే అభిప్రాయం ఇప్పుడు టీడీపీ నేతల్లో మొదలైంది.మొన్న జరిగిన టిడిపి మహానాడులోనూ సుధాకర్ వ్యవహారాన్ని పదేపదే చంద్రబాబునాయుడు ప్రస్తావించారు.

ఈ కేసు ఖచ్చితంగా తమకు లాభం చేకూరుస్తుందని అంచనా వేయగా సి.బి.ఐ రంగంలోకి దిగడంతో మొత్తం ఈ వ్యవహారం అంతా రివర్స్ అయిందని, ఈ విషయంపై ఇక సైలెంట్ గా ఉంటేనే బెటర్ అన్న ఆలోచనతో టిడిపి అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు డిఫెన్స్ లో పడింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test