నిన్న జరిగిన కొంటొన్మెంట్ ఎన్నికలు టీడీపీ-టీఆరఎస్ మధ్య వైరాన్‌ని మరింత పెంచాయి.అసలైతే పాలక పక్షం, ప్రతి పక్షం మధ్య ఉండవలసిన వైరం కాస్తా అటు టీడీపీ, తెరాస మధ్య నడుస్తుంది, దానికి అనేక కారణాలు ఉన్నాయి.
సరే అవన్నీ పక్కనపెడితే నిన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ కు ఎదురుగాలి వీచిన సంగతి తెలిసిందే.అయితే గెలిచాం అన్న అనందమో, లేక గెలిపించుకున్నాం అన్న మదమో తెలీదు కానీ, ఆ గెలుపుతో టీడీపీ పై విల్లు ఎక్కుపెట్టారు తెరాస నాయకులు, అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు మీద పోటీ చేసి గెలిచి.
ఈ మధ్యనే గోడ దూకి తెలంగాణ అధికార పార్టీలోకి చేరటమే కాదు.మంత్రి పదవిని చేజిక్కించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మరింత దూకుడుగా వ్యయహరించారు.
ఆయన మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలు పునరావృతం అవుతాయంటూ ఆయన వ్యాఖ్యానించారు.కంటోన్మెంట్ ఎన్నికల్లో మాదిరి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయంతప్పదని తేల్చారు.
ఇక దీనికి కౌంటర్ గా టీడీపీ నేత మాగంటి గోపీనాథ్ తలసానిని ఉద్దేశించి తలసానికి నిజంగా దమ్ముంటే సనత్‌నగర్ నుంచి మళ్లీ పోటీ చేసి గెలవాలంటూ సవాలు విసిరారు.కేసీఆర్‌కు చెప్పి తన రాజీనామాను ఆమోదింపచేసి ఉప ఎన్నికకు సిద్దం కావాలని ఆయన తలసాని పై విమర్శలు కురిపించారు.
ఇక ఈ విమర్శల గురించి మాత్రం తలసాని మౌనం వహిస్తున్నారు.