బాబు క్లారిటీ తో అభ్యర్థుల్లో పెరిగిన ధీమా ! కానీ ..?  

Tdp Candidates Confidence With Babu Clarity-

టీడీపీ అధినేత చంద్రబాబు లో గెలుపు కాన్ఫిడెన్స్ ఉన్నట్టే కనిపిస్తున్నా తమ్ముళ్లలో మాత్రం ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడా కనిపించడంలేదు. ప్రస్తుతం అధికార పార్టెగా ఉన్నా ఫలితాల ప్రకటన తరువాత ప్రతిపక్షంలో కూర్చోవడం ఖాయం అని దాదాపు అంతా ఫిక్స్ అయిపోయారు. దీనికి తోడు సర్వే ఫలితాలు అనుకూలంగా లేకపోవడం దీనంతటికి కారణంగా తెలుస్తోంది..

బాబు క్లారిటీ తో అభ్యర్థుల్లో పెరిగిన ధీమా ! కానీ ..? -TDP Candidates Confidence With Babu Clarity

ఇక టీడీపీకి అనుకూలంగా బెట్టింగులు కూడా పెద్దగా జరగడంలేదు. ఇవన్నీ తెలుగుదేశం నాయకుల్లో గెలుపు అనుమానాలను పెంచుతున్నాయి. ఇదే సమయంలో వైసీపీలో జోష్ కనిపిస్తోంది.

దాదాపు గెలుపు తమదే అని ఫిక్స్ అయిపోయిన ఆ పార్టీ నేతలు అధికారంలోకి రాగానే ఏమేమి చేయాలనే విషయం మీద లెక్కలు వేసుకుంటున్నారు.

టీడీపీలో ఈ విధమైన అనుమానాలు ఉండగానే క్యాబినెట్ కు ముందు పార్టీ సమీక్షలో మంత్రుల ముఖాలు నీరసంగా ఉండడం బాబు ని ఆలోచనలో పడేసింది. అందుకే వారికి మనం వందకు పైగా సీట్లు సీట్లు సాధించేస్తామని కాన్ఫిడెన్స్ గా చెప్పేస్తూ ధైర్యం నూరిపోస్తున్నారు.

తమకు ఓటమి భయానికి ప్రధాన కారణం చెప్పి అధినేతకు షాక్ ఇచ్చారు మంత్రులు. పోలింగ్ ముందు నుంచి ఈసీపై పోరాటం, ఆ తరువాత ఈవీఎం లపై అనుమానం ఇవన్నీ మన పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవడం తప్పదని ఫిక్స్ అయిపోయినట్టు బాబు వద్ద వీరంతా బావురుమన్నారట.

వారికి దైర్యం చెప్పిన బాబు ఈసీపై, ఈవీఎంలపై పోరాటం ఇవన్నీరాజకీయ వ్యూహంలో భాగంగా చేసిందని ఆయన స్పష్టం చేయడంతో పాటు వంద నియోజకవర్గాల్లో పార్టీ ఏ విధంగా గెలవబోతోంది అనే విషయాన్ని వివరించడంతో వారికి విజయంపై నమ్మకం పెరిగినట్లు టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు అపజయం తప్పదన్న అంచనాల్లో ఉన్న వారిలో ఒక్కసారిగా నమ్మకం పెరిగిపోయింది.

అయితే ఇదంతా కొద్ది రోజులు ఊరట కలిగించడానికి తప్ప బాబు చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని మరికొంతమంది గుసగుసలాడుకుంటున్నారు.