జ‌నాలు మ‌ర్చిపోయిన నేత‌కు కీల‌క ప‌ద‌వా... బాబుపై త‌మ్ముళ్ల గుస్సా...!

ఏపీలో ఇటీవ‌లే పార్టీ అధినేత చంద్ర‌బాబు పార్ల‌మెంట‌రీ జిల్లాల వారీగా పార్టీ అధ్య‌క్షుడు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేశారు.ఈ క్ర‌మంలోనే అత్యంత కీల‌క‌మైన విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ పార్టీ ప‌గ్గాల‌ను మాజీ మంత్రి నెట్టెం ర‌ఘురాంకు క‌ట్ట‌బెట్టారు.

 Tdp Brothers Angry On Chandra Babu, Andhra Pradesh, Parliamentary, Tdp Leaders,-TeluguStop.com

ఈ ప‌ద‌వి ఆయ‌న‌కు ఇవ్వ‌డంతో కృష్ణా జిల్లా తెలుగు త‌మ్ముళ్లే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియ‌ర్లు సైతం నోరెళ్ల బెడుతున్నారు.ఒక‌వేళ విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ పార్టీ ప‌గ్గాల‌ను క‌మ్మ నేత‌కు ఇవ్వాల‌ని బాబు అనుకున్నా అందుకు సమర్థులు అయిన వాళ్లు, వాయిస్ ఉన్న వాళ్లు, కాస్తో కూస్తో ఫేస్ వాళ్ల్యూ ఉన్న వాళ్లు చాలా మందే ఉన్నారు.

వారిని కాద‌ని బాబు జ‌నాలే కాదు.పార్టీ నేత‌ల‌కు కూడా గుర్తులేని మాజీ మంత్రి నెట్టెం ర‌ఘురాంకు ఈ బాధ్య‌త‌లు ఇచ్చారు.రాజ‌కీయాల్లో నెట్టెం ర‌ఘురాం పూర్తిగా అవుట్ డేటెడ్ నాయ‌కుడు.అప్పుడెప్పుడో ఎన్టీఆర్ గాలిలో 1994లో మాత్ర‌మే చివ‌రి సారిగా ఆయ‌న గెలిచారు.

ఆ త‌ర్వాత ఆయ‌నపై ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆయ‌న మంత్రి ప‌ద‌వి కూడా పోయింది.తాను ఎన్నిక‌ల్లో గెల‌వ‌న‌నే జ‌గ్గ‌య్య‌పేట‌లో ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకుని మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాత‌య్య‌కు ప‌గ్గాలు ఇచ్చారు.

Telugu @ncbn, Andhra Pradesh, Chandra Babu, Chandrababu, Krishna, Parliamentary,

ఇప్పుడు బెజ‌వాడ పార్ల‌మెంటు ప‌రిధిలో ఉన్న వాళ్ల‌లో మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని లాంటి వాళ్ల‌తోనే ర‌ఘురాంకు స‌ఖ్య‌త లేదు.ఇక నెట్టెంకు సొంత బావ అయిన ఆప్కాబ్ మాజీ చైర్మ‌న్ టీడీ జ‌నార్థ‌న్‌తోనే ఆయ‌న‌కు స‌ఖ్య‌త లేదు.మ‌రి ఇలాంటి అవుట్ డేటెడ్ నాయ‌కుడిని పెట్టుకుని చంద్ర‌బాబు బెజ‌వాడ‌లో ఏం రాజ‌కీయం చేయాల‌నుకుంటున్నారు ?  నెట్టెంకు అక్క‌డ పార్టీని నిల‌బెట్టే స‌త్తా ఉందా ? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ బాబు, నెట్టంకే తెలియాలంటూ సొంత పార్టీ నేత‌ల్లోనే సెటైర్లు ప‌డుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube