పవన్ కు సీఎం పదవి ! అదేగా వీరికి ఇబ్బంది ?

ఏపీలో అధికార పార్టీ గా ఉన్న వైసీపీ చాలా బలంగా ఉంది.ఆ పార్టీని దెబ్బ తీసి తాము అధికారంలోకి రావాలని బీజేపీ, జనసేన ,టిడిపి వంటి పార్టీలు గట్టిగానే శ్రమ పడుతున్నాయి.

 Tdp Bjp Alliance Trouble On Janasena Issue-TeluguStop.com

జగన్ ప్రభావం పూర్తిగా తగ్గించి, తమ బలం పెంచుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రజల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.బీజేపీ , జనసేన ఒక కూటమిగా, టిడిపి ఒంటరిగా జగన్ ను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాయి.

కానీ బలంగా ఉన్న వైసీపీ ని ఎదుర్కోవడం ఈ మూడు పార్టీలకు సాధ్యపడడం లేదు.వైసీపీ ప్రభుత్వం పై పోరాడేందుకు ఈ మూడు పార్టీల లోని నేతలు ఎవరూ పెద్దగా ముందుకు రాని పరిస్థితి.

 Tdp Bjp Alliance Trouble On Janasena Issue-పవన్ కు సీఎం పదవి అదేగా వీరికి ఇబ్బంది -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయం అందరికీ బాగా తెలుసు.అందుకే కేవలం కొద్దిమంది నాయకులు మాత్రమే యాక్టివ్ గా ఈ మూడు పార్టీల నుంచి కనిపిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే  తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు.

 ఆ పార్టీ  సహకారం ఉంటే తప్పకుండా అధికారంలోకి వస్తామనే ధీమా టిడిపి లో ఉంది.

ఈ విషయంలో బీజేపీ నుంచి కాస్త సానుకూలత ఉన్న, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారం ఇప్పుడు టిడిపికి ఇబ్బందికరంగా మారింది.ఎందుకంటే గతంలో పెద్దగా పవన్ ను పట్టించుకోనట్టు గా వ్యవహరించిన బీజేపీ తిరుపతి ఎన్నికల దృష్ట్యా ఆయనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది.

బీజేపీ ,జనసేన తరపున పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అంటూ బీజేపీ నేతలు ప్రకటించారు.పవన్ ను జాగ్రత్తగా చూసుకోమని కేంద్ర బీజేపీ పెద్దలు చెప్పారు అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడారు.

దీంతో బీజేపీ జనసేన కూటమి తో పొత్తు పెట్టుకుంటే సీఎం విషయంలో తమకు ఇబ్బందులు ఏర్పడతాయని టిడిపి ఆందోళన చెందుతోంది.అయినా పార్టీని అధికారంలోకి తీసుకురావడం అత్యవసరం కావడంతో, బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు మొగ్గు చూపించినా, సీఎం సీటుని త్యాగం చేయాల్సి వస్తుందేమో అన్న ఆందోళన టిడిపిలో కనిపిస్తోంది.

లేకపోతే చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాల్సి ఉంటుంది.దానికి కూడా టిడిపి సిద్ధంగా లేదు.అలా చేయడం వల్ల టిడిపి మరింత బలహీన అవుతుందనేది ఆ పార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది.ఎలా చూసుకున్నా, బీజేపీ , టిడిపి పొత్తు వ్యవహారానికి పవన్ కళ్యాణ్ కు ఇవ్వబోయే సీఎం పదవి అడ్డంకిగా మారిందట.

అలా అని పవన్ ను పూర్తిగా వదిలించుకునేందుకు టిడిపి ఏమాత్రం సిద్ధంగా లేదు.ఎందుకంటే పవన్ కు ఉన్న గ్లామర్ తో పాటు, బలమైన సామాజిక వర్గం అండదండలు,  ఇవన్నీ తమకు దూరమైతే అధికారం దక్కించుకోవడం కష్టం అనేది ఈ రెండు ప్రధాన పార్టీల కు బాగా తెలుసు.

అందుకే పవన్ తో దోస్త్ చేస్తూనే అధికారంలో

.

#Pavan Kalyan #Nara Lokesh #Ap Cm Pavan #Ysrcp #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు