అయ్యన్న వర్సెస్ వైసీపీ : నర్సీపట్నం వచ్చేయ్ సాయిరెడ్డి ..టైం చెప్పు తాగుబోతు ! 

టీడీపీ సీనియర్ లీడర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యవహారం కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.అయ్యన్న నివాసం ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించింది గా మున్సిపల్ అధికారులు తేల్చడంతో , అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ గోడ జెసిబి సాయంతో అధికారులు కూల్చివేయడం తో వివాదం మొదలైంది.

 Tdp Ayyanna Patrudu Vs Ycp Mp Vijayasai Reddy War Of Words Details, Ayyanna Path-TeluguStop.com

చంద్రబాబు ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యవహారం అయ్యన్న వర్సెస్ వైసిపి అన్నట్లుగా విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.

అయ్యన్న ఇంటి గోడ కూల్చేస్తున్న సమయంలో పెద్ద రగడే జరిగింది.టిడిపి కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో పాటు,  జెసిబి డ్రైవర్ ను బెదిరించడంతో కూల్చివేతలు నిలిచిపోయాయి.తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసారు.ఈ వ్యవహారంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో పూర్తిగా కూల్చివేతలు నిలిచిపోయాయి .అయితే ఇప్పటికీ దీనిపై అయ్యన్నపాత్రుడు వైసిపి నాయకులు మధ్య విమర్శలు,  ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఉద్దేశించి అయ్యన్నపాత్రుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.
 

Telugu Ap, Ayyana Patrudu, Ayyannapathrudu, Chandrababu, Jagan, Narsipatnam, Tdp

 ” నన్ను ఎదుర్కోవడానికి రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా నర్సీపట్నం లోనే ఉంది.జెసిబి లు, ఐపీఎస్ లు, ఆర్డీవోలు, వందల సంఖ్యలో పోలీసులు ,పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు, సోషల్ మీడియా కేసులు.అంత భయం ఎందుకు సాయి రెడ్డి ? దమ్ముంటే నేరుగా నువ్వే నర్సీపట్నం వచ్చెయ్ తేల్చుకుందాం.” అంటూ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి అయ్యన్నపాత్రుడు పోస్ట్ పెట్టగా దానికి విజయసాయి రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ” పిల్లి తనను ఎవరు వేటాడుతారా అని ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది.కానీ పులి కన్నా గొప్పదన్నే అని తనకుతానే అనుకుంటుంది.

నేను నర్సీపట్నం వస్తా, డేట్ టైం చెప్పు తాగుబోతు.అయినా నువ్వు అజ్ఞాతంలోకి వెళ్లిపోయావట కదా ! పారిపోకుండా నిలబడు గంజాయి.” అంటూ ఆయనకు విజయసాయి రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు.

     

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube