పవన్ కు ఆ పదవి డిసైడ్ చేశారా ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తున్నారు.కీలక నిర్ణయాలు తీసుకుంటూ, పార్టీ ని పరుగులు పెట్టించేందుకే సిద్ధమయ్యారు.

 Tdp Attempts To Form An Alliance With Janasena Party Janasena, Pavan Kalyan, Jan-TeluguStop.com

ఇప్పటికే ఉద్యమాలతో ఏపీలో జనసేన బాగా ఫోకస్ అయింది.తెలుగుదేశం పార్టీ కంటే జనసేన గురించి ఎక్కువగా జనాల్లో చర్చ నడుస్తోంది.

ఇటీవల వెలువడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు జనసేన వర్గాల్లో ఆశలను రేకెత్తించాయి.బిజెపి కంటే బెటర్ గా పెర్ఫార్మెన్స్ ఉండడంతో, 2024 ఎన్నికల్లో తాము సత్తా చాటగలము అనే ధీమా జనసేన వర్గాల్లో మొదలైంది.

కాకపోతే తమ తో పొత్తు పెట్టుకున్న బిజెపి విషయంలోనే జనసేన తీవ్రంగా ఆలోచిస్తుంది.ఆ పార్టీతో తమకు పొత్తు పేరుకే తప్ప , పెద్దగా ఉపయోగం లేదనే భావన జనసేన వర్గాల్లో ఉంది.

దీనికి తోడు బిజెపి నాయకులు జనసేన వైపు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం వంటి వ్యవహారాలతో పవన్ విసిగిపోయారు .

    త్వరలో బీజేపీతో పొత్తు రద్దు చేసుకునే ఆలోచనలోను ఉన్నారు.ఇప్పటికి ఇప్పుడు ఆ పని చేస్తే పవన్ కు నిలకడ లేదని, ఇప్పటికే వైసీపీ మినహా అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నారు అనే అభిప్రాయం జనాల్లో ఉండడం ఇవన్నీ పవన్ లెక్కలు వేసుకుంటున్నారు.క్రమక్రమంగా జనసేన బీజేపీకి దూరం అవ్వాలని చూస్తోంది.

ఇదే సమయంలో టిడిపి జనసేన దగ్గరయ్యేదుకు ప్రయత్నిస్తోంది.జనసేన కోరినన్ని సీట్లు కేటాయించడం తో పాటు, ఆ పార్టీకి తగిన ప్రాధాన్యం కల్పించడం, అధికారంలోకి వచ్చిన తరువాత కీలకమైన మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధం అన్నట్లుగా టిడిపి సంకేతాలు పంపిస్తోంది.

 

Telugu Ap, Chandrababu, Janasena, Janasenabjp, Janasenani, Pavan Kalyan, Ysrcp-T

     పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఇచ్చేందుకు సిద్ధమనే రాయబారాలు పంపిస్తున్నారట.ఈ క్రమంలో చూసుకుంటే జనసేన టిడిపి బంధం బలపడేందుకు ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.ఇప్పటికే ఉద్యమాలతో జనసేన రాజకీయాలు హీటెక్కిస్తోంది.ఈ క్రమంలోనే ఆ పార్టీ ప్రాధాన్యం గతం తో పోల్చితే బాగా పెరిగిందనే చెప్పాలి.

   

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube