పవన్ తో వెళ్దాం .. ఫలితం సాధిద్దాం ! టీడీపీ నిర్ణయం ?

2024 ఎన్నికల ఫీవర్ ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోంది.వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరగడంతో, దానిని తమకు అనుకూలంగా మార్చుకుని అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారు.

 Tdp, Chandrababu, Jagan, Ysrcp, Ap, Janasenani, Janasena, Tdp Janasena Alliance,-TeluguStop.com

ఆ పట్టుదలతోనే తన వయస్సును సైతం లెక్క చేయకుండా బాబు ఇప్పటికీ యాక్టివ్ గా రాజకీయాలు చేస్తూనే ఉన్నారు.ఏం చేసినా, ఎలా చేసినా 2024 ఎన్నికల్లో గెలిచి తీరాలి అనే పట్టుదల చంద్రబాబుతో పాటు , ఆ పార్టీ నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్లి వైసీపీ ని ఢీ కొట్టినా ఫలితం ఉండదని , అధికారంలోకి వచ్చేంత స్థాయిలో సీట్లను గెలుచుకోవడం అంటే తప్పనిసరిగా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లడమే సరైన మార్గం గా టిడిపి ఒక అభిప్రాయానికి వచ్చేసింది.

ఆ పొత్తు జనసేన తో నే పెట్టుకోవాలి అనేది టిడిపి అభిప్రాయం.

అసలు 2014 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చింది అంటే అది ఖచ్చితంగా జనసేన మద్దతు తోనే అని, ఆ పార్టీ మద్దతు ఇవ్వడం వల్లే ఓడిపోయే స్థానాల్లోనూ టిడిపి గెలిచింది అనే అభిప్రాయం బాబు తో పాటు,  పార్టీ క్యాడర్ లోను ఉంది.ప్రస్తుతం టిడిపి ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 2024 తో ఏదో రకంగా జనసేన పార్టీ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళితే ఖచ్చితంగా టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని , అవసరమైతే జనసేన ను పొత్తు కోసం ఒప్పించేందుకు భారీగానే సీట్లను కేటాయించాలని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి మంత్రివర్గంలో స్థానం కల్పించి , జనసేన తో బలమైన బంధం కొనసాగించాలనే అభిప్రాయం మెజార్టీ టిడిపి నాయకులు కనిపిస్తోంది.

Telugu Chandrababu, Jagan, Janasena, Janasenani, Tdpjanasena, Tdp, Ysrcp-Telugu

ఇదే అభిప్రాయం టిడిపి అధినేత చంద్రబాబులోనూ ఉంది.గత కొంతకాలంగా ఆయన బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.అది సాధ్యమయ్యేలా కనిపించకపోవడంతో , మెల్లిగా పవన్ కు దగ్గరయ్యేందుకు ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జనసేన కూడా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి అధికారంలోకి రావడం కష్టం అనే అభిప్రాయం ఉండడంతో,  తమతో ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటుంది అనేది టీడీపీ నమ్మకం.

కానీ ఈ విషయంలో పవన్ అంతరంగం ఎలా ఉంటుందో ?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube